ఆస్ట్రేలియా.. క్రికెట్లో ఈ పేరు వింటేనే అందరూ భయపడిపోతారు. అంతగా జెంటిల్మన్ గేమ్ మీద కంగారూ జట్టు ప్రభావం చూపించింది. స్వదేశం, విదేశం అనే తేడాల్లేకుండా ఎక్కడ గ్రౌండ్లోకి దిగినా ఆసీస్‌దే విజయం. అవతల ఉన్నది ఎలాంటి జట్టయినా, పిచ్ కండీషన్స్ ఎలా ఉన్నా మ్యాచ్‌ను చేజిక్కించుకోవడం ఆసీస్‌కు వెన్నతో పెట్టిన విద్య. మెరికల్లాంటి పేసర్స్, అద్భుతమైన బ్యాటర్స్ ఆ టీమ్ సొంతం. అందుకే ఇన్నాళ్లూ వరల్డ్ క్రికెట్‌ను శాసిస్తూ వచ్చింది ఆస్ట్రేలియా. ప్రపంచ కప్స్‌లో ఆ టీమ్‌కు ఉన్న రికార్డు ఇంకే టీమ్‌కూ లేదు. ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది ఆసీస్.
ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా టీమ్ ఈసారి వరల్డ్ కప్-2023లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. అసలు ఆడుతున్నది కంగారూ టీమేనా అనేలా వారి పెర్ఫార్మెన్స్ ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా ఫెయిల్ అవుతోంది. మొదటి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన కమిన్స్ సేన.. రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటమి మూటగట్టుకుంది. వన్‌సైడ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 134 రన్స్ తేడాతో చిత్తయింది. 48 ఏళ్ల వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా చేతిలో పరాభవంతో ఈ చెత్త రికార్డును కంగారూ టీమ్ నమోదు చేసింది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో టీమిండియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. గురువారం సౌతాఫ్రికా చేతిలో ఓడింది.
2019 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో వరుసగా ఓటమిపాలైంది ఆస్ట్రేలియా. ఆ ఏడాది సెమీస్‌లో ఇంగ్లీష్ టీమ్ చేతిలో ఓడిన ఆసీస్.. ఆ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 10 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. ఇలా రెండు వరల్డ్ కప్స్‌లో ఆడిన ఆఖరి నాలుగు మ్యాచుల్లోనూ ఓడి అప్రతిష్టను మూటగట్టుకుంది. భారత్, సౌతాఫ్రికాపై ఓటములతో డీలాపడిన కంగారూ జట్టు.. పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ రన్‌రేట్ కూడా (-1.846) నెగెటివ్‌లో ఉంది. పాయింట్ల పట్టికలో పసికూన నెదర్లాండ్స్ (8వ స్థానం) ఆస్ట్రేలియాకు ఎగువన ఉండటం గమనార్హం. కాగా, మెగా టోర్నీలో ముందడుగు వేయాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం ఆరింట్లోనైనా ఆసీస్ నెగ్గాల్సి ఉంటుంది. అలాగే మెరుగైన రన్‌రేట్‌తో నెగ్గితేనే సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది. మరి.. ఆస్ట్రేలియా పెర్ఫార్మెన్స్పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్‌పై నెగ్గాలంటే ఆ ప్లేయర్‌ను టీమిండియా ఆడించాల్సిందే: వెటరన్ క్రికెటర్
Australia first time lost 4 consecutive Matches in the history of World Cups.
– In 48 years of World Cup, first time happened Aussie lost 4 in row…!!!! pic.twitter.com/5yFcpWXH6h
— CricketMAN2 (@ImTanujSingh) October 12, 2023