iDreamPost

పాక్​పై నెగ్గాలంటే ఆ ప్లేయర్​ను టీమిండియా ఆడించాల్సిందే: వెటరన్ క్రికెటర్

  • Author singhj Published - 08:15 AM, Fri - 13 October 23
  • Author singhj Published - 08:15 AM, Fri - 13 October 23
పాక్​పై నెగ్గాలంటే ఆ ప్లేయర్​ను టీమిండియా ఆడించాల్సిందే: వెటరన్ క్రికెటర్

వన్డే వరల్డ్ కప్-2023లో వరుస విజయాలతో టీమిండియా జోరు మీద ఉంది. ఫస్ట్ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్​లో ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తు చేసింది. మూడో మ్యాచ్ కోసం రోహిత్ సేన రెడీ అవుతోంది. అయితే ఈసారి ఎదుర్కోబోయేది చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్​ను కావడం గమనార్హం. ఈ మ్యాచ్​కు అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే రెండు టీమ్స్ అహ్మదాబాద్​కు చేరుకున్నాయి. మొదటి మ్యాచ్​లో ఫెయిలైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​లు ఆఫ్ఘాన్​తో మ్యాచ్​లో తిరిగి గాడిన పడ్డారు. ముఖ్యంగా హిట్​మ్యాన్​ సెంచరీతో చెలరేగాడు.

భారత బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తోంది. అందరూ మంచి ఫామ్​లో ఉన్నారు. డెంగ్యూ బారిన పడిన ఓపెనర్ శుబ్​మన్ గిల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టడం మరో గుడ్ న్యూస్. అయితే బౌలింగ్ విభాగమే కాస్త ఆందోళన కలిగిస్తోంది. స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నా పేస్ యూనిట్ అనుకున్నంతగా రాణించడం లేదు. అందులోనూ మహ్మద్ సిరాజ్​ ఏమాత్రం ఆక్టటుకోవడం లేదు. వికెట్లు తీయకపోగా ధారాళంగా రన్స్ ఇస్తున్నాడీ హైదరాబాదీ. ఈ నేపథ్యంలో పాక్​తో మ్యాచ్​లో టీమిండియా కాంబినేషన్​పై సీనియర్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడో పేసర్​గా బౌలింగ్ ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​ను తీసుకునే బదులు మహ్మద్ షమీని ఆడించాలని సూచించాడు.

‘ఆఫ్ఘానిస్థాన్ లాంటి పసికూన టీమ్​పై కూడా శార్దూల్ ఠాకూర్​ను ఆడించడం ఆశ్చర్యపరిచింది. ఆ జట్టుతో కూడా ఎనిమిదో నంబర్​లో బ్యాటింగ్ చేసే ప్లేయర్ అవసరమా? శార్దూల్ అంత గొప్ప బ్యాటరేం కాదు. అతడు బాల్​కు ఓ రన్ మాత్రమే చేయగలడు. బ్యాటింగ్ డెప్త్ కోసం అతడ్ని ఆడిస్తున్నారు. కానీ శార్దూల్ కంటే షమీని ఆడించడం బెస్ట్. పాక్​తో మ్యాచ్​లోనైనా శార్దూల్​కు బదులు షమీని తీసుకోవాలి. ఈ మ్యాచ్​లో టీమిండియాకు షమీ అవసరం ఎక్కువగా ఉంది’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​కు ఆడుతున్న షమీకి అహ్మదాబాద్​లో మంచి రికార్డు ఉంది. ఈ పిచ్ మీద ఆరంభంలో వికెట్లు తీయడం షమీకి తెలుసు. మరి.. పాక్​తో మ్యాచ్​లో షమి, శార్దూల్​ల్లో ఎవర్ని ఆడిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పరువు పోగొట్టుకున్న ఆసీస్.. జింబాబ్వేని తలపించేలా క్యాచ్​లు మిస్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి