iDreamPost
android-app
ios-app

Boyapati Srinu : మెగాస్టారా ఐకాన్ స్టారా – ఎవరితో సినిమా

  • Published Dec 07, 2021 | 5:07 AM Updated Updated Dec 07, 2021 | 5:07 AM
Boyapati Srinu : మెగాస్టారా ఐకాన్ స్టారా – ఎవరితో సినిమా

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అఖండకు వస్తున్న కలెక్షన్లు చూసి మహా ఆనందంగా ఉంది. జనం మునుపటిలా పూర్తి స్థాయిలో థియేటర్లకు వస్తున్నారన్న భరోసా దక్కింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తున్న తీరు రాబోయే పాన్ ఇండియా సినిమాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది. ఒకవేళ పుష్ప కూడా ఇదే స్థాయిలో స్పందన దక్కించుకుంటే కనక రికార్డుల ప్రవాహానికి అడ్డు అదుపు ఉండదు. ఇంతటి విజయానికి కారణమైన దర్శకుడు బోయపాటి శీను నెక్స్ట్ ఎవరితో చేస్తారన్న సస్పెన్స్ మాత్రం ఇంకా వీడటం లేదు. ఇంత ఊర మాస్ ఎంటర్ టైనర్ ని ఇతను తప్ప ఇంకెవరు హ్యాండిల్ చేయలేరనే స్థాయిలో కాంప్లిమెంట్స్ వచ్చి పడుతున్నాయి.

వినయ విధేయ రామా తాలూకు గాయాల నుంచి బోయపాటి పూర్తిగా బయటపడిపోయారు. రామ్ చరణ్ ని సరిగ్గా వాడుకోలేక అర్థం లేని సినిమా ఇచ్చారన్న నింద తొలగిపోయింది. ఈ నేపథ్యంలో శీనుతో ఏ స్టార్ హీరో జట్టు కడతారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలయ్యింది. గత రెండు రోజుల నుంచి చిరంజీవి తో ఉండొచ్చనే ప్రచారం మీడియాలో జోరుగానే సాగుతోంది. ఇప్పటికే ఆరు సినిమాలను లైన్ లో పెట్టిన మెగాస్టార్ కు నిజంగా బోయపాటితో టై అప్ అయ్యే అవకాశం దగ్గరలో లేదు. ఒకవేళ స్క్రిప్ట్ కోసం ఏడాది టైం తీసుకున్నా కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఏదీ చెప్పలేని పరిస్థితి.శీను ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సరైనోడు కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేయాలన్న ప్రతిపాదన ఉన్నట్టు ఆ మధ్యే టాక్ వచ్చింది. ఒకవేళ చిరంజీవితో సినిమా ప్రచారం నిజం కాకపోతే ఆటోమేటిక్ గా బన్నీతో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందులోనూ పుష్ప తర్వాత అల్లు అర్జున్ కు డైరెక్టర్స్ పరంగా పెద్దగా ఆప్షన్లు లేకుండా పోయాయి. సో బోయపాటికి ఓకే చెబితే మరో మాస్ ఎంటర్ టైనర్ ని ఆశించవచ్చు. అఖండ ఇంకో పది రోజుల దాకా జోరు కొనసాగించే లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. వంద కోట్ల గ్రాస్ ని టార్గెట్ చేసుకున్న బాలయ్య ఈసారి దాన్ని రీచ్ కావడం ఖాయమని వీకెండ్ అయ్యాక వస్తున్న వసూళ్లు చెబుతున్నాయి

Also Read : Puneeth Rajkumar : వెలకట్టలేని కన్నడ పవర్ స్టార్ అభిమానుల ప్రేమ