iDreamPost
android-app
ios-app

జాను మౌనానికి కారణం ఏంటో

  • Published Jan 29, 2020 | 4:30 AM Updated Updated Jan 29, 2020 | 4:30 AM
  • Published Jan 29, 2020 | 4:30 AMUpdated Jan 29, 2020 | 4:30 AM
జాను మౌనానికి కారణం ఏంటో

శర్వానంద్ సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందుతున్న జాను వచ్చే వారం 7న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రమోషన్ విషయంలో టీమ్ ఎందుకనో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో సైతం ఏమంత బజ్ లేదు. చిన్న టీజర్ తో పాటు ఓ ఆడియో సింగల్ రిలీజ్ చేశారు అవి మరీ చార్ట్ బస్టర్స్ గా నిలిచే స్థాయిలో లేవు. సరే ఆల్రెడీ ప్రూవ్ అయిన కంటెంట్ కాబట్టి కొత్తగా పబ్లిసిటీ అక్కర్లేదు అనుకున్నారో ఏమో దిల్ రాజు మాత్రం జానుని ఇంకా పూర్తి స్థాయి వెలుగులోకి తీసుకురావడం లేదు.

తమిళ్ లో గత ఏడాది కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న వసూళ్ల పరంగానూ ఘన విజయం అందుకున్న 96 కన్నడలో జస్ట్ పర్వాలేదు అనిపించుకుంది. దాన్ని డీల్ చేసింది వేరే దర్శకుడు. కానీ జాను విషయంలో దిల్ రాజు రిస్క్ చేయకుండా ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు ప్రేమ్ కుమార్ నే తీసుకొచ్చాడు సమంతా గత ఏడాది మజిలి, ఓ బేబీ సూపర్ హిట్లతో ఫుల్ జోష్ మీదుంది. ఆ ఇమేజ్ తో పాటు శర్వానంద్ బ్రాండ్ కూడా కరెక్ట్ గా పని చేస్తే జానుకి మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి.

ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసిన జానులో ఫీల్ గుడ్ ఎమోషనల్ స్టొరీ ఉంది. అది తమిళ్ లో విపరీతంగా కనెక్ట్ అవ్వడం వల్లే జనం ఎగబడి చూశారు. మరి అదే ఫలితాన్ని ఇక్కడా చూడాలి అంటే జనానికి జాను వస్తోంది అని కాస్త గట్టిగా వినపడేలా ప్రమోట్ చేయాలి. అదే రోజు పెద్ద పోటీ లేదు కాని మరో చిన్న సినిమా సవారి కూడా రంగంలో దిగుతోంది. నందు హీరో కాబట్టి కాంపిటేషన్ అనలేం కాని ఆ టీం కూడా తమ అవుట్ పుట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇంకో ఎనిమిది రోజుల్లో రానున్న జానుఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet