iDreamPost
android-app
ios-app

మరింత ఉపశమనం.. లాక్ డౌన్ మార్గదర్శకాల్లో పలు సవరణలు..

మరింత ఉపశమనం.. లాక్ డౌన్ మార్గదర్శకాల్లో పలు సవరణలు..

ఈనెల 15వ తేదీన జారీచేసిన మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. అటవీ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు చేసుకోవచ్చని తెలిపింది. గిరిజన ఉత్పత్తులు, సేకరణ యధావిధిగా నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. వెదురు, కొబ్బరి,కోకో తదితర ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. వీటిని వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చింది.

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. విద్యుత్, పారిశుధ్యం,పంబ్లింగ్, ఆప్టికల్ ఫైబర్ తదితర విభాగాల్లో పనులు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. తక్కువ సిబ్బంది తో పనిచేసే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 15వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలకు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వైరస్ నియంత్రణ కోసం గత నెల 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీతో లాక్ డౌన్ ముగిసిన కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రెండో దశలో అనుసరించాల్సిన విధానంపై ఈనెల 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధిస్తూ.. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో పలు సడలింపులు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలకు కొనసాగింపుగా తాజాగా పలు సడలింపులు ఇచ్చింది. ఈనెల 20వ తేదీ తర్వాత నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.