ఇవాళ ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కం ట్రేడ్ రిపోర్టర్ తరణ్ ఆదర్శ్ పెట్టిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. సౌత్ లో బాగా పేరున్న ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా వాయిదా పడబోతోందని దసరాకు పోస్ట్ పోన్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని అందులో పేర్కొన్నాడు. ఇంత ప్రత్యేకంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ గురించే అని చరణ్ తారక్ ఫ్యాన్స్ ఇప్పటికే ఓ కంక్లూజన్ కు వచ్చేశారు. అది ఏ సినిమానో తరణ్ మాత్రం చెప్పలేదు.