iDreamPost
android-app
ios-app

విక్రమ్ దర్శకుడి తర్వాతి హీరోలు

  • Published Jun 16, 2022 | 3:51 PM Updated Updated Jun 16, 2022 | 3:51 PM
విక్రమ్ దర్శకుడి తర్వాతి హీరోలు

ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్. విక్రమ్ బ్లాక్ బస్టర్ తో ఇతని రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కమల్ హాసన్ అంతటి పెద్ద స్టార్ నా అప్పులన్నీ తీర్చుకుంటా, కడుపారా ఇష్టం వచ్చినవి తింటా అని చెప్పుకునే స్థాయిలో విజయం అందించడం అంటే మాటలు కాదుగా. ఏళ్ళ తరబడి కనీస యావరేజ్ కూడా లేక ఇబ్బంది పడుతున్న లోకనాయకుడికి ఏకంగా 300 కోట్ల కామధేనువుని కానుకగా ఇచ్చాడు. కథ ఇంకా అయిపోలేదు. ఫైనల్ రన్ అయ్యేలోగా నాలుగు వందల కోట్లు ఈజీగా దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. తెలుగు హక్కులు 7 కోట్లకు అమ్మితే 14 కోట్ల షేర్ ఆల్రెడీ దాటేసింది.

ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తో సినిమాలు చేసేందుకు హీరోలు ఉత్సాహపడుతున్నారు.కానీ అతను ముందుగా చేయబోయేది విజయ్ తో. గత ఏడాది వచ్చిన మాస్టర్ కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేయబోతున్నారు. కాకపోతే కంప్లీట్ గా కొత్త కథ. మరోవైపు రామ్ చరణ్ తో కూడా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. విక్రమ్ షూటింగ్ లో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన క్లూని ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు. మొన్న కమల్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు చరణ్ సిటీలోనే ఉన్నాడట. ఆ పార్టీ అవ్వగానే లోకేష్ తో కలిసి సీక్రెట్ మీటింగ్ జరిపినట్టు ఇన్ సైడ్ టాక్. అది భవిష్యత్తులో చేయబోయే ప్రాజెక్టు గురించేనని అనఫీషియల్ సోర్స్ నుంచి వస్తున్న మెగా లీక్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం లోకేష్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అయితే లోకేష్ ఇంకా ఖైదీ సీక్వెల్ లేదా విక్రమ్ 2 చేయాల్సి ఉంది. సబ్జెక్టు కూడా రెడీగా ఉందని చెన్నై టాక్. మరి చరణ్ తోనో బన్నీతోనో చేయడం జరిగితే అది 2024 తర్వాతే. ఎలాగూ రామ్ చరణ్ శంకర్ తర్వాత గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్ తో సెట్ చేసుకున్నాడు. బన్నీ మాత్రం పుష్ప 2 అయ్యాక ఇంకెవరికి కమిట్ మెంట్ ఇవ్వలేదు. సో లోకేష్ ఇప్పటికిప్పుడు టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేసే అవకాశాలు లేనట్టే. సింపుల్ స్టోరీస్ ని పవర్ ఫుల్ ఎలివేషన్లతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్న వాళ్లలో ప్రశాంత్ నీల్ తర్వాత వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజే.