iDreamPost
android-app
ios-app

టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో సినీ హీరో సూర్య తండ్రి

టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో సినీ హీరో సూర్య తండ్రి

తిరుమల తిరుపతి దేవస్థానంపై సినీ హీరో సూర్య తండ్రి శివకుమార్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తిరుమలలో డబ్బులున్న వారికే దర్శనాలు కల్పిస్తారని శివకుమార్‌ విమర్శించారు. అంతేకాదు గెస్ట్‌హౌస్‌లు కూడా వారికే ఇస్తారని వ్యాఖ్యానించారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని సోషల్‌ మీడియాలో శివకుమార్‌ వాపోయారు. ఇలాంటి పరిస్థితులున్న ఆలయానికి ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.

కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలకు వెళ్లవద్దంటూ శివకుమార్‌ అసత్య ప్రచారం చేశారని, తమిళమయ్యన్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఎనిమిది మందిలో సినీ హీరో సూర్య తండ్రి శివకుమార్‌ ఉన్నారు.

టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారంపై పాలక మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. విజిలెన్స్‌ విభాగం నిత్యం సోషల్‌ మీడియాపై నిఘా పెట్టింది. ఎవరైనా అభ్యంతరకరంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom