iDreamPost
android-app
ios-app

నాగేశ్వరరావు కు జోడిగా భీష్మ బ్యూటీ 

  • Published Feb 12, 2020 | 5:09 AM Updated Updated Feb 12, 2020 | 5:09 AM
నాగేశ్వరరావు కు జోడిగా భీష్మ బ్యూటీ 

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీని ఫినిష్ చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్న క్లారిటీ ఇంకా రాలేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో చేయడం ఖరారైనప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్ టైనర్ కి నాగేశ్వర్ రావు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ఫైనల్ చేస్తారనే టాక్ కూడా ఉంది. 

ఇదిలా ఉండగా ఇందులో చైతు సరసన జోడిగా రష్మిక మందన్నను అనుకుంటున్నట్టుగా తెలిసింది. తను ఎలాగూ మంచి ఫామ్ లో ఉంది. సరిలేరు నీకెవ్వరులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కకపోయినా అర్థమవుతోందా అంటూ చేసిన అల్లరి బాగానే కనెక్ట్ అయ్యింది. ఇక నితిన్ భీష్మలో చాలా స్కోప్ లో ఉన్న రోల్ చేయడంతో పాటు గ్లామర్ పరంగా కాస్త పట్టువిడుపు చూపించినట్టు ప్రోమోస్ లో కనిపించడంతో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందనే ధీమాలో ఉన్నారు ఫ్యాన్స్. 

దీని సంగతి పక్కనబెడితే రష్మికకు కీలక బ్రేక్ గా నిలిచిన గీత గోవిందం దర్శకుడు పరశురామే కాబట్టి వర్క్ ఇంకా సులువవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మజిలీ తర్వాత చైతు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నాడు. లవ్ స్టోరీలో సాయి పల్లవితో జోడి కట్టడం ఇప్పటికే క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు రష్మిక మందన్న అంటే నాగేశ్వర్ రావు ప్రాజెక్టుకు ఆటోమేటిక్ గా హైప్ వస్తుంది. ఇది ఒకే అయితే ఈ సినిమా కూడా ఈ ఏడాది చివర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం టీంతో పాటు ఇతర తారాగణాన్ని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు పరశురాం. ReplyForward

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alBetraBetramadridbetkatlaMarsbahis GirişCasibom GirişJojobet GirişMarsbahis GirişCasibom Giriş