iDreamPost
android-app
ios-app

RC15 : శంకర్ సినిమా టైటిల్ లీక్ అయ్యిందా

  • Published Mar 09, 2022 | 11:07 AM Updated Updated Mar 09, 2022 | 11:07 AM
  • Published Mar 09, 2022 | 11:07 AMUpdated Mar 09, 2022 | 11:07 AM
RC15 : శంకర్ సినిమా టైటిల్ లీక్ అయ్యిందా

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ తో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజమండ్రి పరిసరాల్లో కీలక షెడ్యూల్ పూర్తి చేశాక వెకేషన్ కోసం చరణ్ భార్య ఉపాసనతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయాడు. తిరిగి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లకు 15లోపు వచ్చే అవకాశాలు ఉన్నట్టు టాక్. 2023 సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, జయరాం తదితరులు ఇతర క్యాస్టింగ్. తమన్ సంగీతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అభిమానులు ఇప్పటికే బోలెడు అంచనాలు పెట్టేసుకున్నారు.

తాజాగా వచ్చిన లీక్ ప్రకారం దీనికి టైటిల్ కూడా లాక్ చేశారని తెలిసింది. కథకు సరిపోయేలా ‘సర్కారోడు’ పేరుని పరిశీలిస్తున్నారట. అయితే ఇది అన్ని బాషలకు సెట్ కాదు కాబట్టి తమిళం హిందీలకు వేర్వేరు టైటిల్స్ పెట్టి తెలుగుకు మాత్రం దీన్ని పెట్టేలా ప్లానింగ్ జరుగుతోందని వినికిడి. గతంలో జంజీర్-తుఫాన్ విషయంలో ఇదే జరిగింది. యూనిట్ నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం ప్రస్తుతానికి లేదు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది కాబట్టి ఆలోగా డిసైడ్ చేసి ఫస్ట్ లుక్ తో పాటు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చే దిశగా చూస్తున్నారట. సర్కారోడు బాగానే ఉంది కానీ సర్కారు వారి పాట సౌండ్ వినిపిస్తోంది.

కానీ మాస్ కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యేలా సర్కారోడు ఉన్న మాట వాస్తవం. రెండు షేడ్స్ లో ఉన్న పాత్రల్లో రామ్ చరణ్ కనిపిస్తాడు. అది డ్యూయల్ రోలా లేక ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి వస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కియారాకు సంబంధించిన కాంబినేషన్ సీన్స్ ఇంకా తీయాల్సి ఉంది. ఇది అయ్యాక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. కేవలం ముప్పై నాలుగు రోజుల గ్యాప్ లో చరణ్ రెండు సినిమాలు మార్చి ఏప్రిల్ లో రాబోతున్నాయి. మార్చి 25 ఆర్ఆర్ఆర్, ఏప్రిల్ 29 ఆచార్యతో ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా సిద్ధంగా ఉంది. ఆపై ఎనిమిది నెలల్లోనే సర్కారోడు రెడీ అయిపోతాడు

Also Read : Stand Up Rahul : రాజ్ తరుణ్ టీమ్ ధైర్యం గట్టిదే

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş