iDreamPost
పేరు మోసిన నిర్మాత దిల్ రాజుతో అయినా కొత్తగా ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన డెబ్యూ బ్యానర్ అయినా ఎవరితో చేసినా ఫలితం ఒకేలా ఉంటోంది.
పేరు మోసిన నిర్మాత దిల్ రాజుతో అయినా కొత్తగా ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన డెబ్యూ బ్యానర్ అయినా ఎవరితో చేసినా ఫలితం ఒకేలా ఉంటోంది.
iDreamPost
అప్పుడెప్పుడో ఏళ్ళ కిందట ఉయ్యాలా జంపాలతో పరిచయమై కుమారి 21 ఎఫ్ లాంటి సూపర్ హిట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న కుర్ర హీరో రాజ్ తరుణ్ కు గత కొద్దికాలంగా మినిమమ్ సక్సెస్ దక్కడం లేదు. పేరు మోసిన నిర్మాత దిల్ రాజుతో అయినా కొత్తగా ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన డెబ్యూ బ్యానర్ అయినా ఎవరితో చేసినా ఫలితం ఒకేలా ఉంటోంది. అనుభవించు రాజా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు కానీ అదీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తన ఆశలన్నీ స్టాండ్ అప్ రాహుల్ మీదే ఉన్నాయి. స్టేజి మీద నవ్వులు పూయించే పాత్రలో తన మేకోవర్ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ స్టాండ్ అప్ రాహుల్ కి ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ మార్చి 18. వారం ముందేమో రాధే శ్యామ్ ఉంది. తర్వాత వారం ఆర్ఆర్ఆర్ వస్తోంది. రెండు అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీస్ మధ్య ఏ ధైర్యంతో ఈ రాహుల్ వస్తున్నాడో చూడాలి. ఎంతో కొంత ఆరేడు రోజులు ఆడితే చాలు త్వరగా డిజిటల్ కు ఇచ్చుకోవచ్చనే ఆలోచన ఉందేమో. 17న పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ కూడా బరిలో ఉంది. ఒక టైంలో పునీత్ కి ఇక్కడ మార్కెట్ లేదు కాని సింపతీ మీద ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. సో ఇంత ఒత్తిడి మధ్య రాహుల్ నెగ్గుకురావాలంటే యావరేజ్ కంటెంట్ ఉంటే చాలదు. అదిరిపోయిందనే టాక్ రావాలి.
వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మంచి క్యాస్టింగ్ ఉంది. వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఇంద్రజ తదితరులున్నారు. శాంటో దర్శకత్వం వహించిన స్టాండ్ అప్ రాహుల్ కు స్వీకర్ అగస్తి సంగీతం. అసలు బాలీవుడ్ సినిమాలే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల మధ్యలో వచ్చి ఇరుక్కుపోవడం ఎందుకులే అనుకుంటే ఈ చిన్న చిత్రం ఇంత ధైర్యం చేయడం మెచ్చుకోదగ్గదే. ఇవాళ నుంచే ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. రాధే శ్యామ్ టాక్ ఎంత స్ట్రాంగ్ గా వస్తుందనేది రాహుల్ ఓపెనింగ్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ కాబట్టి బడ్జెట్ కంటెంట్ స్టార్ విషయంలో పోల్చలేం కానీ మొత్తానికి గట్టి ధైర్యమే టీమ్ ది
Also Read : Sunny Leone : గాలి నాగేశ్వరరావు జోడిగా ఐటెం బాంబ్