iDreamPost
android-app
ios-app

ఓటీటీలో పంచాయితీ పెట్టనున్న జయమ్మ.. ఎప్పుడంటే? 

ఓటీటీలో పంచాయితీ పెట్టనున్న జయమ్మ.. ఎప్పుడంటే? 

బుల్లితెరపై ఎవర్ గ్రీన్ యాంకర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే ఒకే పేరు సుమ. మే6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా పెద్ద హిట్ కానప్పటికీ, ఫర్వాలేదనే టాక్ ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది.

జూన్14 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రెగ్యులర్ కంటెంట్ కు భిన్నంగా పూర్తి గ్రామీణ వాతావరణంలో నడిచిన కథను ఎంచుకున్నారు సుమ. అందుకు తగ్గట్లుగానే తెరపై నటించి మంచి మార్కులు కొట్టేశారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై బలగ ప్రకాశ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, యువ దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యం.యం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం.

వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో సమకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. పిల్లల దగ్గర నుంచి, అందరూ సుమను సొంత మనిషిలా భావిస్తారు. అందుకే ఈ సినిమాపై ఓటీటీలో మంచి అంచనాలే ఉన్నాయి. థియేటర్లలో చూడని వాళ్ళతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ జయమ్మ పంచాయితీని ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al