దశాబ్దాలుగా కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన మున్సిపాలిటీ కల ఎట్టకేలకు సాకారమైంది. ఇప్పటివరకు మేజరు పంచాయితీగా కొనసాగుతున్న కుప్పం ని గ్రేడ్ మున్సిపాలిటీ గా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం జిఓ విడుదల చేసింది. నలభై వేల జనాభా గల కుప్పం మునిసిపాలిటీగా మారడం ఇక లాంఛనమే. కుప్పం ని మునిసిపాలిటీ గా చెయ్యాలని దాదాపు పదేళ్ల నుండి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. దురదృష్టవశాత్తూ దీనిపై గత ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తీర్మానం చెయ్యలేకపోయ్యాయి.
Read Also: బెస్ట్ CM జాబితాలో నాలుగో స్థానంలో జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో ఇన్నాళ్లకు కుప్పం మునిసిపాలిటీ గా మారింది. కుప్పం తో పాటు సమీపంలోని ఏడు పంచాయితీలయిన చీలే పల్లె, దళవాయి కొత్తపల్లె, చీమనాయని పల్లె, సామగుట్ట పల్లె, తంబిగాని పల్లె, కమతమూరు, అనిమిగాని పల్లెలను కలుపుతూ మున్సిపాలిటీ గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. అయితే 15 రోజుల క్రితమే కుప్పం తో పాటు కడపజిల్లాలోని కమలాపురాన్ని మునిసిపాలిటీగా మారుస్తున్నట్టు ప్రకటన చేసినప్పటికీ దానికి సంభందించిన జీవోలు జారీ చెయ్యడంలో కొంత జాప్యం జరిగింది. ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చెయ్యడంతో దీనిపై పూర్తి స్పష్టత వచ్చింది.
Read Also: పథకాలు.. పేర్లు.. చంద్రబాబు బాటలో పయనిస్తున్న జగన్
కుప్పం పట్టణం రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గ కేంద్రంగా ఉంది . కుప్పం కి ఒకపక్క కర్ణాటకలోని కోలార్ జిల్లా, మరోపక్క తమిళనాడుకు చెందిన కృష్ణగిరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. “కుప్పం” అంటే తమిళంలో కలసే స్థలం అని అర్ధం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది. బెంగుళూరు పట్టణానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడ తమిళ ప్రభావం అధికంగా కనపడతుంది. కుప్పం మొదటినుండి గ్రానైట్ పరిశ్రమలకి, పూలతోటలకి ప్రసిద్ధి చెందింది.
Read Also: జగన్.. చంద్రబాబు.. జయలలిత విషయంలో ఎవరు చెప్పింది నిజం..?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1989 లో మొదటిసారి గెలుపొందినప్పటి నుండి దాదాపు 30 ఏళ్లగా కుప్పం నియోజకవర్గం నుండే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయినప్పటికీ కుప్పం ని మునిసిపాలిటీగా మార్చలేకపోయాడనే విమర్శ ఆయన మీద ఉంది. ఎట్టకేలకు కుప్పం ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తో కుప్పం మునిసిపాలిటీగా మారనుండడం పట్ల కుప్పం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు