iDreamPost
iDreamPost
 
        
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కి ED నోటీసులు పంపింది. ఓ నకిలీ పురాతన వస్తువులు అమ్మే వ్యక్తితో మోహన్ లాల్ కి లావాదేవీలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి జనాల వద్ద 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత కాపీ.. ఇలా పురాతన వస్తువులు ఉన్నాయని నమ్మించి కొన్ని పాత వస్తువులని తయారు చేసి అమ్మేవాడు.
.అయితే ప్రజలను 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడన్న ఆరోపణలపై మాన్సన్‌ను ఇటీవల కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి మోహన్ లాల్ కి సంబంధం ఉన్నట్టు, గతంలో మోహన్ లాల్ ఇతని ఇంటికి కూడా వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతనితో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (Enforcement Directorate’s) మోహన్ లాల్‌కు నోటీసులు పంపారు. వచ్చే వారం కొచ్చి ED కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు విచారించనున్నారు. నకిలీ పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని ED అధికారులు తెలిపారు. మోహన్ లాల్ కి ED నోటీసులు పంపించింది అని తెలియడంతో మలయాళ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయింది. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.
