iDreamPost
android-app
ios-app

లక్షా యాభైవేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

లక్షా యాభైవేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 6387 పాజిటివ్ కేసుల నిర్దారణ

దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల నాలుగు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6387 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4337 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 170 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 64,426మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 83,004 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2091 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2091 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 54,758 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2091 మంది మహారాష్ట్రలో మృత్యువాతపడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1792 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 32,974 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1065 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా  71 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 1991కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 650 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1284 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 57 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 97 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 2983 కి మందికి కరోనా సోకగా 57 మంది మృత్యువాత పడ్డారు.2017 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 909 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5,685,938 మందికి కోవిడ్ 19 సోకగా 352,227 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,430,786 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,725,275 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 100,572 మంది మరణించారు. అమెరికా దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటాయి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş