iDreamPost
android-app
ios-app

నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

నేడు ఢిల్లీకి సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌ ప్రధాని మోదీతో సమావేశమైన విషయం తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ రోజే హోం మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ అవుతారన్న ప్రచారం జరిగింది. అయితే సమయాభావం వల్ల తిరిగి రాష్ట్రానికి వచ్చిన సీఎం జగన్‌ మళ్లీ నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ దఫా హోం మంత్రితోపాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.