ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం మంత్రివర్గ సమావేశం అనంతరం ఢిల్లీకి బయలుదేరిన సీఎం.. కొద్ది నిమిషాల ముందు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. విభజన చట్టంలోని హామీలు అమలు, పోలవరానికి నిధులు, బడ్జెట్‌లో కేటాయింపులు, మండలి రద్దు.. తదితర అంశాలపై ఆయన ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు. మోదీతో సమావేశం అనంతరం సీఎం జగన్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
4848