iDreamPost
android-app
ios-app

ఆలయ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం

  • Published Jan 17, 2020 | 10:59 AM Updated Updated Jan 17, 2020 | 10:59 AM
ఆలయ భూముల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం

ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ రాబోయే ఉగాదికి రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో అందుకు అనువైన భూములను గుర్తించవలసిందిగా జిల్లా కలెక్టర్లను అదేశిస్తు రెవెన్యు శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి మన్మోహన్ సింగ్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. అయితే తెలుగుదేశం సభ్యులు తమకు మద్దతు పలికే మీడియా ద్వారా మరియు సొషల్ మీడియా వేదికగా, పేదలకు భూ పంపిణి పేరు మీద జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆలయ భూములని సేకరిస్తున్నారని ఇది హిందు సమాజానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్య అని ఆలయాలని నిర్వీర్యం చేసే కుట్ర అని రాజకీయ విమర్శలకు తెరలేపారు.

ఈ ప్రచారంతో ఆందోళన చెందిన అర్చక సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి దేవాలయ భూములని ప్రభుత్వ పథకాలకు సేకరించకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అర్చక సమాఖ్య ప్రతినిధుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి తాజాగా జారీ చెసిన ఉతర్వ్యుల్లో పేదల ఇళ్ళ నిర్మాణం కోసం దేవాలయ భూములు సేకరించకూడదని, సాగునీటి ప్రాజెక్టులకు తప్పనిసరిగా దేవాలయ భూములు సేకరించవలిసి వస్తే అంతే భూమిని ఇతర ప్రాంతాల్లో సేకరించి ఆ దేవాలయానికి ఇవ్వాలని స్పష్టం చేశారు. తద్వారా అర్చకుల జీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతు దేవాలయ భూములు పరిరక్షణకు చర్యలు తీసుకున్న సి.యం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలో దేవాలయాలకు దాదాపు 4.10 లక్షల ఎకరాలు భూమి ఉందని దేవాలయాలకు రాజులు, జమీందారులు, ధర్మకర్తలు భూములు కానుకగా ఇవ్వగా, ఆయా ఆలయాల్లో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు ఆయా భూములు సాగు చేసుకుంటు జీవించేవారమని తెలిపారు. అయితే గతంలోనే 1.09 లక్షల ఎకరాల దేవాలయ భూములు రాష్ట్రంలో అన్యాక్రాంతం అయ్యాయని దీనితో పాటు గతంలో ప్రభుత్వ అవసరాలకు దేవాలయ భూములు సేకరించి ఆ మేర ప్రభుత్వం చెల్లించిన పరిహారం సంబంధిత ఆలయ ఖాతాల్లో జమ అయ్యేదని ఇది అర్చకుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపేదని పేర్కొన్నారు. కానీ జగన్ ప్రభుత్వం తమ విజ్ఞప్తి మేరకు అర్చకుల భూమిని పరిరక్షించటంతో పాటు నీటి ప్రాజక్టులకోసం తప్పని సరై భూమిని తీసుకున్నా అర్చకుల జీవన విధానం దెబ్బతినకుండా ఉండేందుకు భూమికి భూమి ఇవ్వటం అనేది ఖచ్చితంగా అర్చకుల ప్రయోజనాలను రక్షించే కార్యక్రమం అని దీనికి ముఖ్యమంతి జగన్ కు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.