iDreamPost
android-app
ios-app

ఒక్కరోజులో 9,838 పాజిటివ్ కేసులు-274 మరణాలు

ఒక్కరోజులో 9,838 పాజిటివ్ కేసులు-274 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకి 8వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,838 కేసులు, 274మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,26,713 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 6363 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో 7 వ స్థానంలో భారత్ కొనసాగుతుంది. కరోనా వైరస్ బారినుండి 1,08,450 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,11,888 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2933 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2933 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 77793 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 2710 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 44931 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1,465మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 127 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1455 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1587 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 105 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 141  కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 4112 మందికి కరోనా సోకగా 71 మంది మృత్యువాత పడ్డారు. 2529 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,512యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 6,698,615 మందికి కోవిడ్ 19 సోకగా 393,142 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,249,457 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,924,051 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 110,173 మంది మరణించారు.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas girişJojobet