iDreamPost

Netflixలోకి ఈనెల 15 చిత్రాలు.. ఈ 3 మిస్ కావొద్దు!

OTT Suggestions Netflix: నెట్ ఫ్లిక్స్ లో మార్చి నెలలో మొత్తం 15 చిత్రాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే వాటిలో ఈ 3 చిత్రాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

OTT Suggestions Netflix: నెట్ ఫ్లిక్స్ లో మార్చి నెలలో మొత్తం 15 చిత్రాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే వాటిలో ఈ 3 చిత్రాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

Netflixలోకి ఈనెల 15 చిత్రాలు.. ఈ 3 మిస్ కావొద్దు!

ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండియా నెట్ ఫ్లిక్స్ కు అత్యంత ఆదరణ కలిగిన దేశంగా మారిపోయింది. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే హాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాకుండా.. రీజనల్ కంటెంట్ పై కూడా దృష్టి పెట్టింది. ప్రతినెల నెట్ ఫ్లిక్స్ నుంచి ఎన్నో చిత్రాలు విడుదలవుతూ ఉంటాయి. అలాగే ఈ నెల కూడా తమ లిస్ట్ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ లిస్ట్ లో ఈ 3 చిత్రాలను మాత్రం అస్సలు మిస్ కాకూడదు. మరి.. ఆ చిత్రాలు ఏంటి? ఎందుకు మిస్ కాకూడదో చూద్దాం.

మర్డర్ ముబారక్:

ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ మర్డర్ ముబారక్ అనే సినిమా ట్రైలర్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా సారా అలీ ఖాన్ క్యారెక్టర్, పంకజ్ త్రిపాఠి, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ పాత్రలు హెలెట్ అవుతున్నాయి. ఈ మూవీ మార్చి 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది. ఒక రిసార్ట్ లో హత్య జరుగుతుంది. ఆ కేసును దర్యాప్తు చేసేందుకు పోలీసుల ఆఫీసర్ గా పంకజ్ త్రిపాఠి వెళ్తాడు. అక్కడున్న అతిథుల్లో ఎవరు ఆ హత్య చేశారు అనే విషయాన్ని కనిపెట్టే క్రమంలో జరిగే డ్రామా, కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ ని పండిస్తూ కథ సాగుతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీపై హైప్ బాగా పెరిగిపోయింది. అలాగే స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉండేలా ఉంది. అందుకే మార్చి 15న ఒకసారి ఈ సినిమా చూసేస్తే అయిపోతుంది.

మేరీ క్రిస్మస్:

విజయ్ సేతుపతి- కత్రినా కైఫ్ జంటగా వచ్చిన చిత్రమే ఈ మేరీ క్రిస్మస్. ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని ఒక మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. ఈ మేరీ క్రిస్మస్ మూవీ ఇప్పుడు మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే హిందీ, తమిళ్ లోనే కాకుండా.. తెలుగులో కూడా స్ట్రీమ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేదు. కానీ, తెలుగులో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇంక కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి నటన కోసం కచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే.

మామ్లా లీగల్ హై:

మామ్లా లీగల్ హై.. ప్రస్తుతం ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ పేరు బాగా వైరల్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ మార్చి 1 నుంచి నెట్ ప్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కోర్టులో జరిగే వాదనల ఆధారంగా తెరకెక్కించిన కామెడీ డ్రామా. డైరెక్టర్ రాహుల్ పాండే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. రవి కిషన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచే కాకుండా క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ లభిస్తోంది. ఈ కోర్టులో కేసుల విచారణ, లాయర్ల వాదనల నేపథ్యంలో సరదాగా సాగే ఈ సిరీస్ ని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

మార్చి నెల రిలీజులు:

 • మార్చి 1:
 • మామ్లా లీగల్ హై(వెబ్ సిరీస్)
 • స్పేస్ మ్యాన్
 • హోల్మ్స్ అండ్ వాట్సన్
 • స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్
 • బార్డ్స్ ఆఫ్ ప్రే
 • మార్చి 7:
 • ది జెంటిల్ మెన్
 • మార్చి 8: డాంసెల్, ది బ్యాకప్ ప్లాన్
 • మార్చి 10: బ్లాక్ ఆడమ్
 • మార్చి 11: యంగ్ రాయల్స్(వెబ్ సిరీస్)
 • మార్చి 13:
 • ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ది రింగ్
 • ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్
 • మార్చి 15: మర్డర్ ముబారక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి