iDreamPost

ఇన్ స్టాలో ఆన్ ఫాలో కూడా అపరాథమే!

నేటి రోజుల్లో సోషల్ మీడియాలో ఎంత పవర్ ఫుల్ గా మారిందో అందరికి తెలిసిందే. అయితే విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం పెద్ద అపరాధంగా మారిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నేటి రోజుల్లో సోషల్ మీడియాలో ఎంత పవర్ ఫుల్ గా మారిందో అందరికి తెలిసిందే. అయితే విపరీతంగా పెరిగిన సోషల్ మీడియా వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడం పెద్ద అపరాధంగా మారిపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇన్ స్టాలో ఆన్ ఫాలో కూడా అపరాథమే!

ఇవ్వాళ రేపు సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ఎంత పవర్ ఫుల్ గా మారాయంటే …ఇన్ స్టా అన్నది ఈ రోజున మోస్ట్ పవర్ ఫుల్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ ప్లాట్ ఫార్మ్ అయి కూర్చుంది. అందులో ఏ డెవలప్ మెంట్ అయినా, ఏ తేడా వచ్చినా సరే లక్షలాది మంది వెంటవెంటనే, క్షణం కూడా గ్యాప్ లేకుండా రియాక్ట్ అయిపోతున్నారు. తక్షణమే తమ రియాక్షన్స్ పోస్ట్ చేసేస్తున్నారు. ఏమై ఉంటుంది అని క్షణం కూడా ఆలోచించకుండా విరుచుకుపడుతున్నారు. అయితే జనరల్ పబ్లిక్ ను పక్కనపెడితే, సెలబ్రిటీలకు మాత్రం అదో పెద్ద బెడద అయింది.

మొన్నీ మధ్యనే జరిగిన గందరగోళం.. కొన్నాళ్ళ పాటో, కొన్ని రోజులో.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ అకౌంట్ ని అన్ ఫాలో చేసింది. ఇన్ స్టా లో కంటిన్యుస్ గా బిజీగా ఉండే నెటిజన్లు వెంటనే ఆ విషయాన్ని పసిగట్టి, ఏదో తేడా వచ్చేసింది, నయన్ విడాకుల దిశగా ఆలోచిస్తోందని, ఇంక త్వరలోనే వార్తలు కూడా వచ్చేస్తాయని వీరంగం తొక్కారు. కొందరు మాత్రం కొంచెం అలోచనతో టెక్నికల్ రీజన్స్ కారణంగా జరిగుంటుందని, లేదా మరే ఇతర కారణాలైనా కావచ్చని సంసారపక్షంగా పోస్ట్ చేశారు. కానీ, నయన్ కున్న పాప్యులారిటీ అలాంటింది. నయన్ కి ఇన్ స్టాలో 78 లక్షలమంది ( 7.8 మిలియన్స్)ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె కొన్నాళ్ళపాటు అన్ ఫాలో కావడం ఎంత దుమారం లేపిందంటే తనే సద్దుకోలేకపోయినంత గొడవ జరిగింది. మోస్ట్ ఫాలోడ్ ఇన్ స్టా నయన్ దేనట. దీనికి కారణం లేకపోలేదు.

In stalo on follow is also a crime! 1

ఆ మధ్య ఐశ్వర్య రాయ్ కూడా తన భర్త అభిషేక్ బచ్చన్ ని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసింది. వెంటనే నెటిజన్లు రంగంలోకి దిగిపోయారు. ఊహాగానాలతో చెలరేగిపోయారు. దానికి బేస్ ఉంది. అత్తగారు జయాబచ్చన్ కీ ఐసుకి పొంతన లేకుండా పోయింది, ఇద్దరి మధ్యన కోల్డ్ వార్ జరుగుతోంది….ఇవన్నీ బాగా పబ్లిక్ అయిపోయాయి. ఊహాగానాలు చాలా వరకూ నిజమై, ఐసు వేరింటి కాపురం పెట్టుకున్న పర్యవసానాలను అందరూ చూశారు.

అదే మోడల్ లో నయన్ కూడా భర్త విఘ్నేష్ కి దూరం కాబోతోందేమోనన్న అనుమానాలు తీవ్రస్థాయిని చేరుకున్నాయి. దీనికి నయన్ పెద్దగా రియాక్ట్ కాలేదు. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు, ఏ పొరపొచ్చాలు లేకుండా హ్యాపీగా ఉంటున్నారన్న విషయాన్ని తన హాలీడే ట్రిప్ టైంలో ఫొటోలను ఇన్ స్టాలో పెట్టి తన అభిమానులకి ఊరట కలిగించింది. నెగెటివ్ నెటిజన్లకి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణిగిపోయింది. చాలా కాలం ప్రేమలో ఉండి, 2022, జూన్ 9వ తేదీన ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పిల్లలని కూడా సరోగసి విధానంలోనే కన్నారు. మళ్ళీ ఇప్పుడు నయనతార భర్త విఘ్నేష్ శివన్ ని ఫాలో అవుతోంది. అంటే కొన్నాళ్ళపాటు, జస్ట్ కొన్నాళ్ళపాటు అన్ ఫాలో అవడం అన్నది ఎంత పెద్ద అపరాధమూ, నేరమూ అవుతోందంటే…నయన్ కూల్ పర్సన్ కాబట్టి సరిపోయింది. లేకుంటే అదో పెద్ద రచ్చ అయిఉండేది.

ఇదికూడా చదవండి: ఆస్కార్ అవార్డ్స్ 2024.. ఓపెన్ హైమర్ కు అవార్డుల పంట.. విన్నర్స్ వీరే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి