iDreamPost

నయనతార బర్త్‌డే స్పెషల్‌.. ప్రేమ కోసం సినిమాలు వ‍ద్దనుకుని!

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారంటేనే అర్థం అవుతుంది ఆమె రేంజ్‌ ఏంటో...

లేడీ సూపర్‌ స్టార్‌ నయన తారకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారంటేనే అర్థం అవుతుంది ఆమె రేంజ్‌ ఏంటో...

నయనతార బర్త్‌డే స్పెషల్‌.. ప్రేమ కోసం సినిమాలు వ‍ద్దనుకుని!

జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. ఎప్పుడూ.. ఏదో ఒక విషయంలో మనలో మనమే మదనపడే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేస్తాడు. ప్రాణం అనుకున్నవాళ్లనుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. మన జీవితంలో ఏదీ.. ఎవ్వరూ శాశ్వతం కాదు.. అన్నట్లే.. బాధ కూడా ఎక్కువ కాలం ఉండదు. ఒకరి కారణంగా కోల్పోయిన ప్రశాంతత.. ఇంకో రూపంలో.. ఇంకోరి ద్వారా మన జీవితంలోకి వస్తుంది. ఇదే సౌత్‌ ఇండియా లేడీ అమితాబ్‌ నయనతార జీవితంలోనూ జరిగింది.

వరుస బ్రేకప్‌ల కారణంగా ఎంతో నలిగిపోయిన ఆమె జీవితం కొన్నేళ్ల పాటు నరకప్రాయంగా మారింది. ఒకానొక సమయంలో ప్రేమ కారణంగా ఆమె సినిమాల్లోనుంచే తప్పుకోవాలని అనుకున్నారు. కానీ, ప్రేమ కారణంగా పడ్డ బాధలకు సినిమానే దిక్కయింది. అలాంటి ఆమె జీవితంలోకి ‘విగ్నేష్‌ శివన్‌’ వచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా.. ఓ వైపు కుటుంబాన్ని.. లేడీ అమితాబ్‌లా నటనా రంగాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే, ఓ పదేళ్ల క్రితం వరకు ఆమె జీవితం వివాదాల చుట్టూ తిరుగుతూ.. తరచుగా మీడియాకు పని చెబుతూ ఉండేది.

శింబుతో ప్రేమ వ్యవహారం.. ఫొటోలు లీక్‌..

2006లో వచ్చిన ‘వల్లవన్‌’ సినిమా టైంలో శింబు-నయనతార ప్రేమలో పడ్డారు. ప్రేమ వ్యవహారం ముదిరి పెళ్లి వరకు వెళ్లింది. వీరి ప్రేమ వ్యవహారం గురించి పబ్లిక్‌కు తెలియని సమయంలో.. పుకార్లుగానే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఫొటోలు అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ఆ కొద్ది రోజులకే ఇద్దరూ విడిపోయారు. వీరు విడిపోవటానికి సరైన కారణాలు ఏవో ఎవ్వరికీ తెలియదు. వీరిద్దరూ కూడా బ్రేకప్‌ గురించి నేరుగా ఎవ్వరికీ చెప్పలేదు.

బ్రేకప్‌ అయిన కొన్నేళ్ల తర్వాత శింబుతో ప్రేమ గురించి నయనతార మాట్లాడుతూ.. ‘‘ ప్రేమలో ఓ లెవల్‌ వరకు మాత్రమే అపార్థాలు.. మనస్పర్థలను భరించొచ్చు. అవి భరించలేనంతగా ఉంటే జీవితం నరకం అవుతుంది. ప్రేమలో ఉన్నపుడు నాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందుకే విడిపోయా.. ఓ టైంలో ప్రేమ కోసం సినిమాలు వదిలేద్దామని అనుకున్నాను. కానీ, ప్రేమలో ఇబ్బందుల కారణంగా సినిమాలే నాకు దిక్కయ్యాయి. నా జీవితం నేను అనుకున్నట్లుగా ఎప్పుడూ లేదు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుదేవాతో ప్రేమ.. మతం మార్పు.. 

శింబుతో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టిన తర్వాత నయనతార కొన్నేళ్ల పాటు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి ఆమె జీవితంలోకి ప్రభుదేవా రూపంలో మళ్లీ ప్రేమ మొదలైంది. 2009లో ‘విల్లు’ సినిమా టైంలో వీరిద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు కాగా.. విజయ్‌ హీరోగా చేశాడు.  ఆ పరిచయం కొద్దిరోజులకే స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. వీరి ప్రేమ వ్యవహారం గురించి మీడియాకు తెలిసింది. బాహాటంగానే వార్తలు రాయటం మొదలుపెట్టాయి. కొన్ని నెలల పాటు ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్‌గా ఉంచిన వీరు తర్వాత ఓపెన్‌ అయ్యారు.
జంటగా అన్ని చోట్లకు కలిసి తిరగటం మొదలుపెట్టారు. మీడియాలో రోజుకో రకమైన వార్తలు రాసాగాయి. దీంతో ప్రభుదేవ​ భార్య ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. నయనతారకు నేరుగా వార్నింగ్‌ కూడా ఇచ్చారన్న టాక్‌ ఉంది. ప్రభుదేవ మీద ఉన్న ప్రేమతో నయనతార మతం మార్చుకున్నారు. హిందువుగా కన్వర్ట్‌ అయ్యారు. ప్రభుదేవతో కలిసి గుళ్లకు కూడా తిరగటం మొదలుపెట్టారు. భార్య లతతో గొడవలు విడాకుల వరకు వెళ్లాయి. 2011లో ప్రభుదేవ తన భార్యకు విడాకులు ఇచ్చారు. అయితే, ఏమైందో ఏమో తెలీదు కానీ, మరుసటి సంవత్సరమే ప్రభుదేవా- నయనతారల మధ్య బ్రేకప్‌ అయింది.

నయనతార గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • నయనతార అసలు పేరు డయానా మరియమ్‌ కురియన్‌.
  • సినిమాల్లోకి రాకుముంద ఆమె టీవీ హోస్ట్‌గా పని చేశారు. లైఫ్‌ స్టైల్‌, ఫ్యాషన్‌ షోలకు హోస్ట్‌గా వ్యవహారించారు.
  • నయనతార పుట్టుకతో క్రిష్టియన్‌.. కానీ, 2011లో ఆమె మతం మారారు. చెన్నైలోని ఆర్య సమాజ్‌లో హిందూ మతాన్ని స్వీకరించారు.
  • 2011లో ఆమె నందమూరి బాలకృష్ణతో కలిసి ‘‘శ్రీరామ రాజ్యం’’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత నయనతార నటనకు గుడ్‌ బై చెప్పాలనుకున్నారన్న టాక్‌ నడిచింది. నటనకు గుడ్‌బై చెప్పి ప్రభుదేవను పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలని కూడా అనుకున్నారట. కానీ, ఊహించని పరిణామంగా ఇద్దరూ విడిపోయారు.
  • నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాదు.. నయనతారకు ఓ లిప్‌ బామ్‌ కంపెనీలో కూడా వాటాలు ఉన్నాయి.
  • ప్రభుదేవతో ప్రేమలో ఉన్నపుడు ఆమె ఆయన పేరు తన చేతిపై పచ్చ బొట్టు వేయించుకుంది. బ్రేకప్‌ తర్వాత ఆ పేరును ‘పాజిటివిటీ’గా మార్చుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి