iDreamPost

సీరియస్ డిస్కషన్లో నాని ‘వి’

సీరియస్ డిస్కషన్లో నాని ‘వి’

షూటింగులకు అనుమతులు వచ్చాయి కాని థియేటర్ల పరిస్థితే అంతు చిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం అసలది గుర్తించాల్సిన అంశమే కాదన్న తరహాలో వ్యవహరిస్తుండటంతో రాష్ట్రాలు కూడా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో ప్రాధాన్యత క్రమంలో ముందున్నది నాని వినే. మార్చ్ 25ని షెడ్యూల్ చేస్తే సరిగ్గా దానికి పది రోజుల ముందు అన్ని మూతబడ్డాయి. ఇప్పటికీ 90 రోజులకు దగ్గరలో ఉంది. ఆ మధ్య కొంతకాలం ఓటిటిలో రావోచ్చనే ప్రచారం జరిగింది కాని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యింది.

దీని మీద సుమారు 25 కోట్ల దాకా పెట్టుబడి జరిగింది. అంతకు ఎక్కువే ఇస్తామని స్ట్రీమింగ్ సంస్థలు ఆఫర్ ఇచ్చినప్పటికీ రాజు గారు నో చెప్పారని కూడా టాక్ వచ్చింది. కాని ఇప్పుడు సీన్ మారిందని ఫిలిం నగర్ అప్డేట్. ఏం చేయాలనే దాని మీద సమాలోచనలు జరుగుతున్నాయని తెలిసింది. ఇక్కడ ఇంకో వెర్షన్ కూడా ఉంది. గతంలో చాలా సినిమాలు నిర్మాణంలో జరిగిన ఆలస్యం వల్ల ఏళ్ళ తరబడి ఎదురు చూసినా విజయం సాధించాయి. దానికి అమ్మోరు, అరుంధతిలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. అంజి మాత్రం ఆశించిన ఫలితం అందుకోలేదు. కాని ఎంత లేట్ అయినా అప్పటి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. కాని ఇప్పుడలా కాదు.

జనం సినిమాలు చూసే మూడ్ లో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఆదాయాలు తగ్గిపోయిన నేపధ్యంలో మునుపటి టికెట్ ధరలకు తగ్గట్టు కలెక్షన్లు వస్తాయా అని. అందుకే నాని వి డిజిటల్ రిలీజ్ ఆప్షన్ గురించి దిల్ రాజు తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టు వినికిడి. ఆహా భారీ డీల్ కూడా ఇచ్చిందట. నిశబ్దం, అరణ్యలు సైతం ఇదే తరహ అయోమయంలో ఉన్నాయి. ఏ నిర్ణయమూ ఎటు తీసుకోలేక సతమవుతూ ఉన్నారు. అలా అని ఎవరూ బల్లగుద్ది మేము థియేటర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పట్లేదు. రెడ్, ఉప్పెనలు మాత్రమే ఈ విషయంలో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. నాని అభిమానులు మాత్రం సరిగ్గా మా హీరో సినిమాకే ఇలా జరగాలా అని తెగబాధపడిపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి