iDreamPost
android-app
ios-app

ఒకే వేదిక పైకి బాలకృష్ణ, NTR.. నిజం కానున్న అభిమానుల కల!

  • Author singhj Published - 06:21 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 06:21 PM, Sun - 27 August 23
ఒకే వేదిక పైకి బాలకృష్ణ, NTR.. నిజం కానున్న అభిమానుల కల!

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత పేరు, ప్రతిష్టలు, జనాదరణ కలిగిన కుటంబాల్లో నందమూరి కుటుంబం ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కల్యాణ్​ రామ్​ వరకు అందర్నీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. సీనియర్ ఎన్టీఆర్ చూపిన బాటలో అలుపెరగకుండా శ్రమిస్తూ, తమ నటనతో ఆడియెన్స్ మనసులు దోచుకున్నారు ఆయన వారసులు. అందులో నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్​కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్​కు మాస్​లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీన్ని పక్కనబెడితే.. వీళ్లిద్దరూ కలసి ఒకే వేదిక మీద కనపడి చాలా రోజులవుతోంది. రీసెంట్​గా జరిగిన నందమూరి సుహాసిని కొడుకు పెళ్లి వేడుకలో అందరూ కలసి కనిపించారు. ఎన్టీఆర్, మోక్షజ్ఞలు ప్రేమగా మాట్లాడుకోవడం, ఒకర్నొకరు హత్తుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే బాలయ్య, తారక్​లు కలిసినట్లుగా, మాట్లాడుకున్నట్లుగా ఫొటోలు, వీడియోలు ఎక్కడా కనిపించలేదు. దీంతో వీళ్లను ఒకే వేదికపై చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

నందమూరి ఫ్యాన్స్​కు ఒక గుడ్ న్యూస్. బాలయ్య, తారక్​లు ఒకే వేదిక మీద కలసి కనిపించనున్నారు. వంద రూపాయల నాణెంపై సీనియర్ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నాణాన్ని సోమవారం ఆయన కుటుంబ సభ్యుల నడుమ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకే నందమూరి కుటుంబాన్ని వెంటనే ఢిల్లీకి రావాలని ఆహ్వానించింది. కేంద్రం ఆహ్వానితుల్లో చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లంతా రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. బాలయ్య, తారక్​లు కలసి వెళ్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ ఆ వేదికపై వీరు కలసి కనిపిస్తే మాత్రం అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet