iDreamPost

నాన్న ట్రైలర్ టాక్.. నాని ఓ మంచి రిస్క్ చేస్తున్నట్టు ఉన్నాడు!

హాయ్ నాన్న మూవీ సినిమాపై అంచనాలు పెంచేసింది ట్రైలర్. ఇందులో నాని లుక్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. సరికొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

హాయ్ నాన్న మూవీ సినిమాపై అంచనాలు పెంచేసింది ట్రైలర్. ఇందులో నాని లుక్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తున్నాడు. సరికొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

నాన్న ట్రైలర్ టాక్..  నాని ఓ మంచి రిస్క్ చేస్తున్నట్టు ఉన్నాడు!

బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టి క్లాప్ డైరెక్టర్ నుండి హీరోగా మారి.. సక్సెస్ ఫుల్ నటుడిగా దూసుకెళుతున్నాడు నాని. తన క్యూట్ నటనలతో బాయ్ నెక్ట్ డోర్ అన్నట్లుగా కనిపిస్తాడు. తన సహజమైన నటనతో నాచురల్ స్టార్ అయిపోయాడు. కెరీర్ పరంగా అక్కడక్కడ తడబడ్డా.. మళ్లీ నిలదొక్కుకుని బ్యాక్ టు బ్యాక్ గుడ్ మూవీస్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసేందుకు కష్టపడుతున్నాడు. అటు నిర్మాతగా మారి క్రియేటివ్ థాట్స్ ఉన్న డైరెక్టర్లకు ఆఫర్లు ఇస్తున్నాడు. ఒకే జోనర్ మూవీస్ కట్టుబడిపోకుండా కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటూ.. ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ కోవలో వస్తున్న మూవీనే హాయ్ నాన్న.

ఇటీవల విడుదలైన హాయ్ నాన్న ట్రైలర్ మూవీపై ఎక్స్‌పర్టేషన్స్‌ను పెంచేశాయి. కారణం కంటెంట్ చాలా కొత్తగా, ప్రెష్‌గా అనిపిస్తుండటమే. ఈ ట్రైలర్ పై పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇందులో తండ్రి, కూతుళ్ల మధ్య బాండింగ్ మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటికీ కూడా చాలా మంది సీనియర్ హీరోలు సైతం టచ్ చేయని.. ఫ్యామిలీ సబ్జెక్ట్‌లో ( ముఖ్యంగా హీరోకు పెళ్లై.. పిల్లలు ఉండటం) నాని కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొత్తగా ఏదో చేసేందుకు ట్రై చేస్తున్నాడు ఈ నాచురల్ స్టార్. పది ఫైట్లు, నాలుగు డైలాగులు, ఐదారు సాంగ్స్‌తో సరిపెట్టుకోవడం లేదు. యునిక్ కథలతో చూసీగా సినిమాలు చేస్తున్నాడు. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న చాలా చిత్రాలకు.. రిస్క్ చేసి మరీ సెపరేట్ ట్రాక్ వేస్తున్నట్లే కనిపిస్తోంది ఈ మూవీ.

నిజం చెప్పాలంటే ఇలాంటి మూవీస్ టాలీవుడ్ పరిశ్రమను మరో రేంజ్‌లో నిలబెడతాయి. అయితే హీరోస్ ఇలాంటి మూవీస్ చేసినప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు ఆదరించాల్సి ఉంటుంది. అప్పుడే సరికొత్త జోనర్‌లో చిత్రాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ప్రేక్షకులు పిక్చర్స్‌ను ఎంజాయ్ చేస్తున్న విధానం మారింది. అలాంటప్పుడు హీరోలు కూడా ఛేంజ్ అవుతూ.. కొత్త కథలు చేస్తున్నారు. ముఖ్యంగా నాని లాంటి హీరో గత కొన్ని సినిమాల నుండి సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు తపన పడుతున్నాడు. శ్యామ్ సింగ్ రాయ్, దసరా మూవీస్ చూస్తే.. నిజమేనని అనిపించకమానదు. ఇప్పుడు మరో సారి ఫుల్ లెంత్‪లో కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపించబోతున్నాడు పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని.

ఈ మూవీని ప్రేక్షకులు హిట్ చేయడంపైనే ఆధారపడి ఉంది.. తన తదుపరి సినిమాల నిర్ణయం. డిఫరెంట్ రోల్స్, క్యారెక్టర్, మూవీస్‌లో చూడాలంటే.. ఇలాంటి చిత్రాలను కచ్చితంగా ఆదరించాల్సిన బాధ్యత సినీ ప్రియులదే. ఈ డిసెంబర్ 7న విడుదల కాబోతుంది. మృణాల్ ఠాకూర్, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది. ఖుషి సినిమాతో సరికొత్త ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించిన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ ఈ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సమయమాతో పాటు గాజు బొమ్మ సాంగ్స్ ఇప్పటికే హిట్ అయిన సంగతి విదితమే. ఎలాంటి జోనర్ లో అతడిని చూడాలనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి