iDreamPost

ఈ అన్నాదమ్ముల్ని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండియాని శాసిస్తున్నారు!

ఈ ఫోటోలో కనిపిస్తున్న అన్నాదమ్ములిద్దర్ని గుర్తు పట్టారా.. ఇండియాను శాసిస్తున్నారు. అందరు అన్నాదమ్ముల్లాగే ఈ ఇద్దరు కూడా గొడవలు పడ్డారు. ఒకరు ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నులు కాగా, ఇప్పుడు మరొకరు తన హవాను కొనసాగిస్తున్నారు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న అన్నాదమ్ములిద్దర్ని గుర్తు పట్టారా.. ఇండియాను శాసిస్తున్నారు. అందరు అన్నాదమ్ముల్లాగే ఈ ఇద్దరు కూడా గొడవలు పడ్డారు. ఒకరు ఒకప్పుడు ఆసియాలోనే అత్యంత సంపన్నులు కాగా, ఇప్పుడు మరొకరు తన హవాను కొనసాగిస్తున్నారు.

ఈ అన్నాదమ్ముల్ని గుర్తుపట్టారా? ఇప్పుడు ఇండియాని శాసిస్తున్నారు!

మనం కాస్త సంపాదిస్తుంటే చాలు..నా అంతటోళ్లు ఈ భూ ప్రపంచంలోనే లేరు అన్న ఫోజులిస్తుంటాం. మనకు కాస్త ఆస్తి ఉంటేనే కన్ను మిన్ను కానరాదు. మన కాలు భూమి మీద నిలబడదు. మన చూపు ఆకాశంలో ఉంటుంది. దేన్నైనా డబ్బుతో కొనేయచ్చు అని భావిస్తుంటారు. డబ్బున్నతోనే స్నేహాలు, షికార్లు. ఇక తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చే.. వాటిని రెండింతలు చేయాల్సింది పోయి.. వాటిని కరిగించేంత వరకు పనికి పోరు. జల్సాలు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. సాధారణంగా బాగా డబ్బుంటే ఇదే జరుగుతుంటుంది. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు అలా కాదు.. తండ్రి ఇచ్చిన ఆస్తిని పదింతలు చేశారు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ వ్యాపార వేత్తలుగా ఎదిగారు.

ఆత్మ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టుకుని.. తన కాళ్ల మీద నిలబడాలన్న లక్ష్యంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సక్సెస్ అయ్యాడు తండ్రి. వేల కోట్లకు అధిపతి అయ్యాడు. తరతరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిని సంపాదించాడు. అంత సంపాదన ఉంటే.. మనమైతే.. లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాం. కానీ అతడి కొడుకులు అలా కాదు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ .. డబ్బును రెట్టింపు చేశారు. ఇంతకు వాళ్లెవరంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ధీరూభాయ్ అంబానీ..తనయులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ధీరూభాయ్, కోకిలా బెన్ పెద్ద కుమారుడు ముఖేష్ అంబానీ.. ఇప్పుడు దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత అయిన అతడి నికర విలువ 113.7 బిలియన్ డాలర్స్. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు కాగా, ప్రపంచంలో కోటీశ్వరుల్లో 11వ స్థానంలో ఉన్నాడు.

ఇక ముఖేష్ సోదరుడు అనిల్ అంబానీ సైతం ఒకప్పుడు ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉండేవారు. అయితే 2002లో తండ్రి చనిపోయిన తర్వాత అన్నాదమ్ముల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో కొన్ని సంస్థలు ఇతడి ఆధీనంలోకి వచ్చాయి. తొలుత అతడి వ్యాపార సామ్రాజ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నిలిచింది. టెలికారం రంగంలో ఒక్కసారిగా ఎదిగాడు. కానీ ఆ తర్వాత సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడంతో వరుసగా అప్పుల్లోకి కూరుకుపోయాడు. ప్రస్తుతం నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. చైనా బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నా.. తిరిగి చెల్లించలేకపోయాడు. మూడు బ్యాంకులకు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. లండన్ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే తన వద్ద అంత డబ్బు లేదని కోర్టుకు చెప్పడం గమనార్హం. మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. తాజాగా అన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లలో అనాకారిగా వచ్చి వెళ్లిపోయినట్లు మీడియా కంటికి కనిపించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి