iDreamPost

నితిన్​కు ధోని సర్​ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే..?

  • Author singhj Published - 03:38 PM, Wed - 29 November 23

టాలీవుడ్ హీరో నితిన్​కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇంతకీ ఆయన ఏం ఇచ్చారంటే..!

టాలీవుడ్ హీరో నితిన్​కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించారు. ఇంతకీ ఆయన ఏం ఇచ్చారంటే..!

  • Author singhj Published - 03:38 PM, Wed - 29 November 23
నితిన్​కు ధోని సర్​ప్రైజ్ గిఫ్ట్! ఏం ఇచ్చాడంటే..?

స్టార్ హీరో నితిన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీన ఈ మూవీ వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ ఫిల్మ్ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమా మీద మంచి బజ్ నెలకొంది. హీరో నితిన్ కూడా ప్రమోషన్లతో దుమ్మురేపుతున్నారు. వరుసగా మీడియాతో ఇంటరాక్ట్​ అవుతూ ‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్’ మీద ఎక్స్​పెక్టేషన్స్​ను మరింత పెంచేస్తున్నారు. స్టార్ స్టోరీ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్​లో వస్తున్న ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్​గా యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయ్​రాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషన్స్​లో తాను చేయబోయే ఇతర సినిమాల గురించి కూడా నితిన్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తనకు ‘భీష్మ’ రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఒక ఫిల్మ్ ఉంటుందన్నారు. ఇది ‘భీష్మ’ను మించేలా ఉంటుందని చెబుతూ హైప్ పెంచారు. డిఫరెంట్ కాన్సెప్ట్​తో ఈ మూవీని వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్నారని చెప్పారు. అయితే ఈ చిత్రంలో మొదట హీరోయిన్​ క్యారెక్టర్​కు రష్మిక మందన్నను సెలక్ట్ చేసింది మూవీ యూనిట్. కానీ డేట్స్ ఇష్యూ కారణంగా ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

వెంకీ కుడుముల సినిమాలో రష్మిక నటిస్తున్నారా? లేదా? అనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే ‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రమోషన్​లో ఈ విషయం మీద కూడా స్పష్టత ఇచ్చారు నితిన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉందని.. బాలీవుడ్ మూవీస్​లో యాక్ట్ చేసేందుకు నటీమణులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పారు. అయితే ఆ సినిమాలోని పాత్రకు శ్రీలీల సరిగ్గా సరిపోతుందని దర్శకుడు వెంకీ చెప్పారని నితిన్ అభిప్రాయపడ్డారు. ఇంకోసారి శ్రీలీలతో కలసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. ఆమె తెలుగమ్మాయి కావడం మరో ప్లస్ పాయింట్ అని పేర్కొన్నారు.

‘ఎక్స్​ట్రా ఆర్డినరీ మ్యాన్’లో నితిన్ సరసన నటిస్తున్న శ్రీలీల.. ఈ మూవీ రిలీజ్ కాకముందే మరోమారు ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు వెంకీ కుడుముల చిత్రం మరో లక్కీ ఆఫర్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. హీరో నితిన్​కు టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా నితిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ట్విట్టర్​లో ఓ ఫొటో చేసిన ఈ స్టార్ హీరో.. అందులో ఒక టీషర్ట్​ను చేతిలో పట్టుకొని కనిపించారు. దీనికి ‘ఎక్స్​ట్రార్డినరీ మ్యాన్ నుంచి ఎక్స్​ట్రార్డినరీ గిఫ్ట్’ అని క్యాప్షన్ పెట్టారు. నితిన్​కు బెస్ట్ విషెస్ చెప్పిన ధోని.. ఈ షర్ట్​ మీద తన సంతకం చేశారు. మరి.. నితిన్​కు ధోని సర్​ప్రైజ్ గిఫ్ట్ పంపడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సిరీస్‌ మధ్యలో వెళ్లి.. ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి