iDreamPost

కల్కి మూవీ టికెట్స్ బ్లాక్ లో కొంటున్నారా? ఇది అతి పెద్ద మోసం!

  • Published Jun 26, 2024 | 2:29 PMUpdated Jun 26, 2024 | 3:30 PM

Kalki 2898AD Movie Tickets: మరి కొన్న గంటల్లో ప్రభాస్ కల్కి కల్కి 2898 ఏడీ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వారికి టికెట్స్ దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియాలోని బ్లాక్ లో టికెట్స్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. అలా మీరు కనుక చేస్తే రిస్క్ లో పడినట్లే.

Kalki 2898AD Movie Tickets: మరి కొన్న గంటల్లో ప్రభాస్ కల్కి కల్కి 2898 ఏడీ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే వారికి టికెట్స్ దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియాలోని బ్లాక్ లో టికెట్స్ కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. అలా మీరు కనుక చేస్తే రిస్క్ లో పడినట్లే.

  • Published Jun 26, 2024 | 2:29 PMUpdated Jun 26, 2024 | 3:30 PM
కల్కి మూవీ టికెట్స్ బ్లాక్ లో కొంటున్నారా? ఇది అతి పెద్ద మోసం!

ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏ నోట విన్నా అంతా ప్రభాస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతలా కల్కి సినిమా దేశమంతాట ఒక ఫీవర్ లా మారిపోయింది. అయితే ఎట్టకేలకు అందరీ ఎదరుచూపులు ఫలించనున్నాయి. మరో కొన్ని గంటల్లో అందరూ వేయి కన్నులతో ఎదురు చూస్తున్నా కల్కి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ముందు నుంచే అడ్వాన్స్ గా టికెట్స్ బుకింగ్ చేసుకున్నారు. అసలే నాగ్ ఆశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో అందరీ చూపు కల్కి సినిమా మీదనే ఉంది.ఇదిలా ఉంటే.. ఇక సినిమా టికెట్స్ కోసం చాలామంది ఎంతగానో కష్టపడుతున్నారు.పైగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్కి సినిమా టికెట్స్ ధరలు భారీగా పెంచేశారు.

అయితే ఎంతైనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూడకపోతే ఏదో చిన్న వెలుతుగా ఉంటుంది. అందుకోసమే కల్కి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దమనుకుంటున్న వారికి టికెట్స్ దొరకట్లేదు. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియాలో బ్లాక్ లో టికెట్స్ కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలా మీరు కూడా చేస్తున్నరా.. అయితే మీరు మోసపోయినట్లే. మరి ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరికొన్ని గంటల్లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా దేశవ్యాప్తంగా థియటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమ టికెట్స్ కూడా హాట్ కేకుల్లా దేశమంతా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ కు కల్కి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామనుకుంటే టికెట్స్ దొరకట్లేదు. పోని మొదటిరోజు ఏ షో అయినా పర్వలేదు అనుకున్నా సరే టికెట్స్ దొరకే మార్గమే కనిపించడం లేదు.ఈ క్రమంలోనే మూవీ టికెట్స్ కోసం బ్లాక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇక వారి దగ్గర టికెట్స్ కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే.. ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అంటే ఏదో థియేటర్ల దగ్గర యాభై, వంద అని చెప్పి అమ్ముకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పెరిగింది. దీంతో అంతా సోషల్ మీడియాలో ఏ పనైనా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. అయితే మొదటగా టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించమని చెప్పున్నారు. దీంతో టికెట్స్ కోసం ఆశపడి డబ్బులు పంపిస్తుంటే.. తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. ఇక ఆ తర్వాల వాళ్లని ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు ఆన్‌లైన్ టికెట్‌ని ఎవరైనా మీకు అమ్మిన సరే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు. ఎందుకంటే బార్ కోడ్ ఉన్న టికెట్‌ని మీకు విక్రయించినట్లే, వేరొకరికి కూడా అమ్మే అవకాశముంది.

ఇక ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచింది. అలా కాకపోతే పూర్తి మొత్తంలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అలస్యంగా అయినా సినిమా చూసిన పర్వాలేదు కానీ, ఇలా సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్స్ పేరుతో టికెట్స్ కొనుగోలు చేసి డబ్బులు మాత్రం పొగొట్టుకోకండి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కల్కి సినిమా రేపు అనగా జూన్ 27న దేశవ్యాప్తంగా విడుదల కానున్నా విషయం తెలిసిందే. ఇకపోతే ఇందులో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి