iDreamPost
android-app
ios-app

TDP, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు..వైరస్: మంత్రి జోగి రమేశ్

TDP, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు..వైరస్: మంత్రి జోగి రమేశ్

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరో ముందడుగు వేశారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయనీ , కేంద్ర ఆశీస్సులు తమ కూటమికి ఉండాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరి భవిష్యత్తు కోసం టీడీపీతో కలసి ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తామని స్పష్టం చేశారు. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో  బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ప్రసంగించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కలయిక విషతుల్యం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురువారం మంత్రి జోగి రమేశ్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెడనలో అటెన్ష్ ప్లే చేయాలని పవన్ కల్యామ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి విమర్శించారు. సినిమా స్టైల్లో  రాళ్ల దాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని జోగి రమేశ్ దుయ్యబట్టారు. పెడనలో జరిగిన పవన్ సభ అట్టర్ ఫ్లాప్  అయ్యిందని జోగి రమేశ్ మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసినా కూడా  రెండు వేలమంది జనాన్ని కూడా తెచ్చుకోలేక పోయారని అన్నారు. పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు నియోజకవర్గ ప్రజలకు పవన్ క్షమాపణలు చెప్పాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” కేవలం రెండు వేలమందితో కూడా సభ పెట్టుకోలనే పరిస్థితి జనసేకు ఏర్పడింది. అవనిగడ్డలో ప్లాప్ షో నిర్వహించారు. పెడనలో కూడా అదే రీపిట్ అయ్యింది. ఇంక ఆయన చెబుతున్న టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు అది వైరస్. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కలయిక విషంతో సమానం. టీడీపీ, జనసేన కలిసిన తరువాత మరింత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. పవన్ కి సిగ్గు, మనస్సాక్షి లేదు” అంటూ మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. అత్తారింటికి దారేది సినిమా ఎక్కడో పైరసీ జరిగితే మా పెడన కళంకారీ తమ్ముళ్లను  పవన్ కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ఆ కళాకారులను గౌరవించి సత్కరించింది. అలాంటి వారిని రౌడీలతో పోల్చుతావా పవన్? అంటూ మంత్రి ప్రశ్నించారు. మరి.. మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.