iDreamPost

40, 50వేలు పెట్టి AC కొనలేరా? రూ.2 వేలకు పోర్టబుల్ AC! పేదోళ్ళకి ఆఫర్!

  • Published Apr 15, 2024 | 1:28 PMUpdated Apr 15, 2024 | 1:28 PM

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో.. ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రత, వేడి, ఉక్కపోతల నుంచి ప్రజలకు ఉపశమనం పొందేందుకు మార్కెట్ లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక వీటి ధర చూస్తే మతిపోవాల్సిందే.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో.. ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రత, వేడి, ఉక్కపోతల నుంచి ప్రజలకు ఉపశమనం పొందేందుకు మార్కెట్ లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక వీటి ధర చూస్తే మతిపోవాల్సిందే.

  • Published Apr 15, 2024 | 1:28 PMUpdated Apr 15, 2024 | 1:28 PM
40, 50వేలు పెట్టి AC కొనలేరా?  రూ.2 వేలకు పోర్టబుల్ AC! పేదోళ్ళకి ఆఫర్!

ఈ ఏడాది ఎక్కడ చూసిన ఎండలు భగ భగ మండిపడుతున్నాయి. ఏ ప్రాంతంలోనైనా వాతవరణం నిప్పుల కుంపటిలా ఉంటుంది. అసలు ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపంను చూపిస్తున్నాడు. ఇలాంటి సమయంలో బయటకి వెళ్లలేక, అలా అని ఇంట్లో కూడా ఉండలేక ప్రజలు అల్లడిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండటంతో.. బయటకి వెళ్తే ఎండ.. ఇంట్లో ఉంటే మంటలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వేసవి వేడి నుంచి ఇంట్లో ఉపశమనం పొందడానికి ప్రజలంతా.. ఏసీలు, కూలర్ల వెంట పడుతున్నారు. అవి ఎంతో ఖరీదు ఉన్న వాటిని కొనుగోలు చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వాటి డిమాండ్ కూడా మార్కెట్ లో బాగా పెరిగిపోయింది. అయితే వీటి ధరలు పెరగడంతో సామాన్యులు ఈ ఏసీలను కొనాలంటే.. కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కావునా, ఇది సాధ్యమైనది కాదు. ఇక ఇలాంటి వారి కోసం మార్కెట్ లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చేశాయి. కాగా, వీటిని ఇంట్లోనే కాకుండా.. ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు. పైగా వీటి ధర కూడా చాలా తక్కువగా ఉండటం విశేషం. ఇంతకి వీటి ధర ఎంత.. ఎక్కడ దొరుకుతున్నాయో తెలుసుకుందాం.

ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో.. ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎండలు తీవ్రతను తట్టుకోలేక ప్రజలు అల్లడిపోతున్నారు. ముఖ్యంగా విపరీతమైన వేడి, ఉక్కపోతను తట్టుకోలేక ఏసీ, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ లో వీటి ధర, డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అయితే సామన్యులు వీటిని కొనాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కావునా.. అలాంటి వారి కోసం తాజాగా పోర్టబుల్ ఏసీలు అనేవి అందుబాటులోకి వచ్చేశాయి. అలాగే వీటిని ఇంట్లోనే కాకుండా.. ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

Portable AC

కాగా, ఈ పోర్టబుల్ ఏసీలను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక దీని ధర కేవలం రూ. 2,500 మాత్రమే. పైగా 40 శాతం తగ్గింపుతో రూ. 1,498కి లభిస్తోంది. అయితే పోర్టబుల్ ఏసీకి ఈఎంఐ సదుపాయం కూడా కలిగివుంది. ఈ క్రమంలోనే నెల నెల రూ. 136 కట్టి చక్కగా దీనిని మీ ఇంట్లో వినియోగించుకోవచ్చు.  ఇక ఈ మినీ ఏసీకి పైన ఇచ్చి వాటర్ ట్యాంక్‌లో నీటిని ఒక్కసారి నింపితే చాలు. బయట ఉన్న వేడి గాలిని చక్కగా.. చల్లని గాలిగా మార్చేసి విపరీతమైన కూలింగ్ ను ఇస్తుంది. ఇందులోని ఫ్యాన్ స్పీడ్‌ను మీ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఇది మీకు చల్లటి గాలిని మాత్రమే కాదండీ.. నైట్ డిఫెరెంట్ కలర్స్‌లో లైటింగ్ కూడా అందిస్తుంది. అలాగే దీని నుంచి వచ్చే సౌండ్ కూడా తక్కువ. కనుక చక్కగా మీరు రాత్రి వేళలో ఈ మినీ పోర్టబుల్ ఏసీని పెట్టుకొని హాయిగా నిద్రపోవచ్చు. మరి, అమెజాన్ లో అతి తక్కువ  ధరకే అందుబాటులోకి వచ్చిన మినీ పోర్టబుల్ ఏసీ పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి