iDreamPost

MI vs GT: నెహ్రా vs పాండ్యా.. ఇది రోహిత్‌ vs పాండ్యాను మించిన గొడవ!

  • Published Mar 25, 2024 | 3:43 PMUpdated Mar 25, 2024 | 3:43 PM

ఐపీఎల్-2024లో ముంబై-గుజరాత్ మధ్య మ్యాచ్​లో ఓ వార్ హైలైట్​గా నిలిచింది. రోహిత్-పాండ్యాను మించిన గొడవ ఇది. ఈ ఫైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్-2024లో ముంబై-గుజరాత్ మధ్య మ్యాచ్​లో ఓ వార్ హైలైట్​గా నిలిచింది. రోహిత్-పాండ్యాను మించిన గొడవ ఇది. ఈ ఫైట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 25, 2024 | 3:43 PMUpdated Mar 25, 2024 | 3:43 PM
MI vs GT: నెహ్రా vs పాండ్యా.. ఇది రోహిత్‌ vs పాండ్యాను మించిన గొడవ!

క్రికెట్​లో కొన్ని వార్స్​ మీద అందరికీ ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లేయర్ల మధ్య, టీమ్స్ మధ్య గొడవలు కామనే. ఆయా ఆటగాళ్లు లేదా జట్లు మళ్లీ తలపడినప్పుడు చూద్దామని అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఒకే జట్టులోని ఇద్దరు ఆటగాళ్లు, అలాగే ఒక టీమ్ కెప్టెన్​కు, ఇంకో టీమ్​ కోచ్​కు మధ్య వార్​ను మాత్రం ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేయలేరు. కానీ ఈసారి ఐపీఎల్-2024లో ఇదే హైలైట్ అవుతోంది. ముంబై ఇండియన్స్-గుజరాత్ టైటాన్స్ నడుమ జరిగిన మ్యాచ్​లో రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా వార్ మీద అందరూ ఫోకస్ చేశారు. హిట్​మ్యాన్​ను అవమానిస్తూ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయమని ఆదేశించాడు పాండ్యా. దీంతో రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్​ మీద సీరియస్ అవడం, కుక్క.. కుక్క అంటూ అతడ్ని గేలి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే మ్యాచ్​లో జీటీ కోచ్ ఆశిష్ నెహ్రా-పాండ్యాకు మధ్య వార్ కూడా హైలైట్​గా నిలిచింది.

ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఆశిష్ నెహ్రా గట్టిగా బుద్ధి చెప్పాడు. తమ జట్టును మధ్యలోనే వదిలేసి వెళ్లిన పాండ్యాకు తన సత్తా ఏంటో చూపించాడు నెహ్రా. రెండేళ్ల కింద ముంబై ఇండియన్స్​లో ఉన్న హార్దిక్ పాండ్యాకు బెస్ట్ ప్రైజ్ ఇచ్చి మరీ తెచ్చుకుంది గుజరాత్ టైటాన్స్. అతడికి కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. సారథ్యంలో ఓనమాలు తెలియని పాండ్యాకు అన్నీ తానై నేర్పించాడు కోచ్ ఆశిష్ నెహ్రా. హార్దిక్ గ్రౌండ్​లో ఉండి టీమ్​ను చూసుకుంటే.. బౌండరీ లైన్​కు ఆవల నిలబడి అసలు కథ అంతా నెహ్రా నడిపించాడు. మ్యాచ్​ సిచ్యువేషన్స్​కు తగ్గట్లు ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు వేస్తూ జీటీని గెలిపించాడు. ఈ క్రమంలో ఒక ఏడాది కప్పును కొట్టిన గుజరాత్, మరుసటి ఏడాది రన్నరప్​గా నిలిచింది. అయినా మళ్లీ ముంబై నుంచి భారీ ఆఫర్ రావడంతో జీటీని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు పాండ్యా.

కెప్టెన్సీ ఇచ్చి ఎంకరేజ్ చేసినా హార్దిక్ మధ్యలోనే టీమ్​ను వదిలేసి వెళ్లిపోవడంతో గుజరాత్ మేనేజ్​మెంట్​తో పాటు నెహ్రా కూడా కోపంగా ఉన్నాడు. ఆ అగ్రెషన్​ను, కసిని ముంబైతో మ్యాచ్​లో చూపించాడు. హార్దిక్​ జట్టును ఎలాగైనా ఓడించాలని ఫిక్స్ అయ్యాడు నెహ్రా. పాండ్యా కెప్టెన్సీ వల్ల కాదు, తన కోచింగ్ వల్లే జీటీ ఇన్నాళ్లూ నెగ్గుకుంటూ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయాలని అనుకున్నాడు. ఎంఐతో మ్యాచ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెహ్రా.. లాస్ట్ బాల్ పూర్తయ్యే వరకు బౌండరీ లైన్ బయటే నిలబడ్డాడు. ఎప్పటికప్పుడు కొత్త కెప్టెన్ శుబ్​మన్ గిల్​తో పాటు బౌలర్లకు అవసరమైన సూచనలు ఇచ్చాడు. ఈజీగా నెగ్గాల్సిన ముంబైని ఓడించి పాండ్యాకు గట్టిగా బుద్ధి చెప్పాడు నెహ్రా. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కెప్టెన్సీలో హార్దిక్ జీరో అని నెహ్రా ప్రూవ్ చేశాడని అంటున్నారు. పాండ్యాకు ఏదీ చేతకాదని.. ఓవరాక్షన్ చేయడం తప్ప అని కామెంట్స్ చేస్తున్నారు. అటు రోహిత్​, ఇటు నెహ్రాతో ఫైట్​లో అతడు ఓడిపోయాడని.. బ్యాటర్​గా, బౌలర్​గా, కెప్టెన్​గానూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని చెబుతున్నారు. మరి.. హార్దిక్-నెహ్రా ఫైట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: MI vs GT: పాండ్యాను తిడుతున్నవారు ఇది తెలుసుకోండి! అతని తప్పు లేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి