iDreamPost

MIని ఓడించిన చెత్త నిర్ణయం.. హార్దిక్​కే కాదు 5 కప్పులు అందించిన రోహిత్​కూ తట్టలేదు!

  • Published Apr 15, 2024 | 3:37 PMUpdated Apr 15, 2024 | 3:37 PM

లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్​లో చెన్నై చేతిలో ఓడింది ముంబై. ఈ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నా అందులో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు. ఒకే ఒక్క చెత్త నిర్ణయం హార్దిక్ సేన కొంపముంచింది.

లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్​లో చెన్నై చేతిలో ఓడింది ముంబై. ఈ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నా అందులో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు. ఒకే ఒక్క చెత్త నిర్ణయం హార్దిక్ సేన కొంపముంచింది.

  • Published Apr 15, 2024 | 3:37 PMUpdated Apr 15, 2024 | 3:37 PM
MIని ఓడించిన చెత్త నిర్ణయం.. హార్దిక్​కే కాదు 5 కప్పులు అందించిన రోహిత్​కూ తట్టలేదు!

గెలుపుబాట పట్టింది ఇక ఢోకా లేదని అనుకుంటున్న టైమ్​లో మరోసారి పరాజయం పాలైంది ముంబై ఇండియన్స్. వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్​లో కనిపించిన హార్దిక్ సేన.. చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో పాయింట్స్ టేబుల్​లో 8వ స్థానానికి పడిపోయింది ఎంఐ. సీఎస్​కే నిర్దేశించిన 206 పరుగుల టార్గెట్​ను ఆ టీమ్ రీచ్ కాలేకపోయింది. ఛేజింగ్​లో ఒత్తిడికి లోనైన ముంబై ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్) సెంచరీతో విజృంభించినా లాభం లేకపోయింది. ఆఖరి వరకు క్రీజులో ఉన్నా మ్యాచ్​ను ఫినిష్ చేయలేకపోయాడు హిట్​మ్యాన్. చివరి దాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో ముంబై ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నా అందులో ఇది ప్రధానమైనదిగా చెప్పొచ్చు.

ఒకే ఒక్క చెత్త నిర్ణయం హార్దిక్ సేన కొంపముంచింది. అందులో కొత్త కెప్టెన్ పాండ్యాతో పాటు మాజీ సారథి రోహిత్ శర్మకూ వాటా ఇవ్వాల్సిందే. ఎంఎస్ ధోనీని వాళ్లిద్దరూ ఆపలేకపోయారు. అదే ముంబై ఓటమికి కారణమైంది. ఆఖర్లో వచ్చి 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు మాహీ. ఛేజింగ్​కు దిగిన ఎంఐ 20 ఓవర్లకు 186 పరుగుల దగ్గర ఆగిపోయింది. మ్యాచ్ ముగిసేసరికి రెండు జట్ల మధ్య ఉన్న తేడా 20 పరుగులే. ఆ రన్స్ ఆఖరి ఓవర్లో మాహీ కొట్టినవే. లాస్ట్ ఓవర్ హార్దిక్ వేయడం ఆతిథ్య జట్టును దారుణంగా దెబ్బతీసింది. ఆఖర్లో వచ్చి మ్యాచ్​లు ఫినిష్ చేయడంలోనూ, భారీ స్కోర్లు సెట్ చేయడంలో ధోని దిట్ట. ముఖ్యంగా భారత బౌలర్లపై అతడికి అద్భుత రికార్డు ఉంది. అందుకే ఏ టీమ్ అయినా మాహీ క్రీజులో ఉంటే ఫారెనర్స్​కు బంతిని ఇస్తారు. కానీ పాండ్యా మాత్రం స్వయంగా తానే బౌలింగ్​కు దిగాడు. బుమ్రా లాంటి డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్​ను టీమ్​లో పెట్టుకొని అనవసర రిస్క్ తీసుకున్నాడు.

ధోనీని ఆపి సత్తా చూపిద్దాం అనుకున్నాడు. కానీ అతడి పించ్ హిట్టింగ్​కు బలయ్యాడు పాండ్యా. కనీసం రోహిత్ అయినా ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించాల్సింది. ఒకవేళ బుమ్రా ఆఖరి ఓవర్ వేస్తాడని అంచనా వేస్తే తాను రావడానికి బదులు రవీంద్ర జడేజాను ధోని పంపేవాడు. జడ్డూ ఫామ్​లో లేడు కాబట్టి రన్స్ చేసేవాడు కాదు. అలా కాదని మాహీనే బ్యాటింగ్​కు వచ్చినా బుమ్రా బౌలింగ్​లో ఒకట్రెండు బౌండరీలు కొట్టేవాడేమో గానీ 20 రన్స్ చేయడం మాత్రం కష్టమే. దీని గురించి రోహిత్ ముందే ఆలోచించి పాండ్యాను ఆపాల్సింది. హార్దిక్ ఓవర్​ను ముందే ఫినిష్ చేసి బుమ్రాకు ఆఖరి ఓవర్‌‌ ఇవ్వాల్సింది. కానీ అది జరగలేదు. మాహీ వచ్చాడు. తన పని తాను చేసి టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరి.. ముంబై ఓటమికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి