iDreamPost

MGలో ఈ SUV ఎంతో స్పెషల్.. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి!

MG Astor 2024 Price: మోరిస్ గ్యారేజెస్ ఇండియా సరికొత్తగా తీసుకొచ్చిన ఎస్యూవీకి ఎందుకంత డిమాండో తెలుసుకోండి.

MG Astor 2024 Price: మోరిస్ గ్యారేజెస్ ఇండియా సరికొత్తగా తీసుకొచ్చిన ఎస్యూవీకి ఎందుకంత డిమాండో తెలుసుకోండి.

MGలో ఈ SUV ఎంతో స్పెషల్.. సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి!

కారు కొనాలి అని ఫిక్స్ అయిన తర్వాత చాలామంది అదే పనిగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కారు కొనాలి? ఎంతలో కొనాలి? ఏ సెగ్మెంట్ లో తీసుకోవాలి? అని చూస్తూ ఉంటారు. మీరు గనుక ఎస్యూవీ తీసుకోవాలి అనుకుంటే ఈ మోడల్ మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. అయితే ఇది ధర పరంగా కాస్త ప్రీమియంగా ఉంటుంది. కానీ ఫీచర్స్, సేఫ్టీ, లుక్స్ అన్నింటి పరంగా మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుంది. పైగా ఈ కంపెనీ కార్లకు భారత మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ కూడా ఉంది. అది మరేదో కాదు.. MG Astor. ప్రస్తుతం 2024లో సరికొత్త లుక్స్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తో వచ్చేసింది. మరి.. ఆస్టర్ లో అంత స్పెషల్ ఏంటో చూద్దాం.

మోరిస్ గ్యారేజెస్ కంపెనీకి ఇండియాలో మంచి మార్కెట్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, ఆస్టర్ మోడల్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఈవీల్లో కొత్తగా వచ్చిన ఎంజీ కామెట్ కు కూడా గిరాకీ బాగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు అన్ని కంపెనీలు తమ మోడల్స్ ని 2024లో అప్ డేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే మోరిస్ గ్యారేజెస్ ఇండియా కూడా ఆస్టర్ ఎస్యూవీని అప్ డేట్ చేసింది. ఫీచర్స్ ని పెంచి.. ధరను కాస్త తగ్గించి రిలీజ్ చేశారు. మరి.. ఆ ఆస్టర్ స్పెసిఫికేషన్స్ విషయానకి వస్తే.. ఇందులో మొత్తం 6 ప్రధానమైన ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే.. స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్, షేవీ, బ్లాక్ స్టారమ్ స్పెషల్ ఎడిషన్ అనే ట్రిమ్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆస్టర్ లో మాన్యూవల్, ఆటోమేటిక్ ట్రాన్సిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూయల్ మాత్రం కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇంజిన్ విషయానికి వస్తే.. రెండు ఇంజిన్ ఆప్షనస్ తో వస్తోంది. 1.3 టర్బో పెట్రోల్ ఇంజిన్(140పీఎస్/220ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్(110పీఎస్/ 144ఎన్ఎం టార్క్) ఆప్షన్స్ ఉన్నాయి. 1349సీసీ నుంచి 1498సీసీ వరకు అందుబాటులో ఉంది. వేరియంట్ మారే కొద్దీ సీసీ, స్పెసిఫికేషన్స్ మారుతూ ఉంటాయి. ఫీచర్స్ చూస్తే.. 10 ఇంచెసె ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 ఇంచెస్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, పనోరామిక్ సన్ రూఫ్ వంటి ఇట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా ఆస్టర్ కు మంచి మార్కలే పడతాయి.

ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వార్డ్ కోయిలేషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేక్ కీపింగ్, హై భీమ్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ADAS ఫీచర్స్ ఉన్నాయి. 360 గిడ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. కలర్స్ చూస్తే హవానా గ్రే, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్, స్టేరీ బ్లాక్ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ లో వైట్- బ్లాక్ ఆప్షన్ ఉంది. ఇంక ధర విషయానికి వస్తే.. ఆస్టర్ ఎక్స్ షోరూమ్ ధర బేస్ మోడల్ పై రూ.9.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హైఎండ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.17.98 లక్షలుగా ఉంది. ఆన్ రోడ్ ధర అయితే ఒక్కో వేరియంట్ మీద రూ.60 వేల నుంచి లక్షల్లో పెరిగే అవకాశం ఉంటుంది. మరి.. మోరిస్ గ్యారేజెస్ ఇండియా వారి ఆస్టర్ మోడల్ 2024 ఎడిషన్ ధర, ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి