iDreamPost

Chiranjeevi: చిరు చేతికి కాస్టలీ వాచ్.. దీని ధర ఎంతంటే !

  • Published Feb 27, 2024 | 5:46 PMUpdated Feb 27, 2024 | 5:46 PM

ఈ మధ్య కాలంలో స్టార్ సెలెబ్రిటీలు ధరించిన డ్రెస్సెస్ ను ఆన్ లైన్ ప్రైజ్ తో కంపేర్ చేసి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కన్ను మెగాస్టార్ ధరించిన వాచ్ మీద పడింది.

ఈ మధ్య కాలంలో స్టార్ సెలెబ్రిటీలు ధరించిన డ్రెస్సెస్ ను ఆన్ లైన్ ప్రైజ్ తో కంపేర్ చేసి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కన్ను మెగాస్టార్ ధరించిన వాచ్ మీద పడింది.

  • Published Feb 27, 2024 | 5:46 PMUpdated Feb 27, 2024 | 5:46 PM
Chiranjeevi: చిరు చేతికి కాస్టలీ వాచ్..  దీని ధర ఎంతంటే !

మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారో అందరికి తెలుసు. ఇన్ని సంవత్సరాల ఆయన కష్టానికి ప్రతి ఫలంగా ఆయనకు దక్కిన బిరుదు పద్మవిభూషణ్. ఇటీవల కేంద్రం ప్రకటించిన పురస్కారాల్లో చిరు పేరు ఉండడంతో .. ఇంకా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇక మరో వైపు చిరంజీవి తన రాబోయే చిత్రానికి కావాల్సిన విధంగా సన్నద్ధం అవుతున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ .. మెగా హీరో వరుణ్ తేజ్ సినిమా “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు. ఇక మెగాస్టార్ ఆ ఈవెంట్ లో చూడడానికి చాలా సింపుల్ గా కనిపించారు. ఈ క్రమంలో చిరు చేతికి ఉన్న వాచ్ అందరిని అట్ట్రాక్ట్ చేసింది. ఆ వాచ్ కూడా చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న కూడా.. ఆ వాచ్ ధర చూస్తే మాత్రం అందరు ఆశ్చర్య పోవాల్సిందే.

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా.. సెలెబ్రిటీలు ధరించిన దుస్తుల ధరలను ఆన్ లైన్ ప్రైజ్ తో కంపేర్ చేసి.. వాటి ఒరిజినల్ ప్రైజెస్ తో కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. దానిని వైరల్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఈ ట్రెండ్ కన్ను చిరు ధరించిన వాచ్ మీద పడింది. సాధారణంగానే చిరు దగ్గర కార్స్, వాచెస్ కలెక్షన్ బాగా ఉంటుంది. కొన్ని కోట్లు విలువ చేసే వస్తువులు కూడా వాటిలో ఉన్నాయి. ఇంకా సినీ సెలెబ్రిటీలంటే ఆమాత్రం ఉండడం సహజం. ఈ క్రమంలోనే చిరు దగ్గర ఉన్న రోలెక్స్ వాచ్ నుంచి బెంజ్ కార్ వరకు కొన్ని కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం చూశాము . ఇక ఇప్పుడు చిరు చేతికి ఉన్న సింపుల్ వాచ్ ధర తెలిస్తే అందరు నోళ్లు వెళ్ళబెట్టుకోవాల్సిందే.

The price of this watch is so many lakhs

తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రీ రిలీజ్ కు వచ్చిన చిరు.. ఏ. లాంజ్ & సోహ్నే అనే బ్రిటిష్ కంపెనీ వాచ్ ను చేతికి ధరించి కనిపించారు. ఇక సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు.. ఆ వాచ్ ధరను ఆరాతీసారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఆ వాచ్ ధర అక్షరాలా రూ.50,56,747. అంటే దాదాపు అరకోటి వరకు ఈ వాచ్ ధర పలుకుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు .. పవన్ సినిమాలో డైలాగును గుర్తుచేసుకుంటూ.. “ఆ వాచ్ అమ్మితే మా బ్యాచ్ బ్యాచ్ బ్రతికేయొచ్చు” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి, చిరు చేతికి ఉన్న వాచ్ ధర వైరల్ అవుతున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి