iDreamPost

Bangalore vs. Hyderabad: ఖాళీ అవుతున్న బెంగుళూరు! హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్న జనాలు!

  • Published Mar 28, 2024 | 6:42 PMUpdated Mar 28, 2024 | 6:42 PM

మెట్రోపాలిటన్ సిటీ గా పేరు తెచ్చుకున్న బెంగుళూరు అంటేనే ఇప్పుడు చాలా మంది వణికిపోతున్నారు. ఈ క్రమంలో అంతా కూడా హైదరాబాద్ కు తరలి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెట్రోపాలిటన్ సిటీ గా పేరు తెచ్చుకున్న బెంగుళూరు అంటేనే ఇప్పుడు చాలా మంది వణికిపోతున్నారు. ఈ క్రమంలో అంతా కూడా హైదరాబాద్ కు తరలి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏమై ఉంటుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 28, 2024 | 6:42 PMUpdated Mar 28, 2024 | 6:42 PM
Bangalore vs. Hyderabad: ఖాళీ అవుతున్న బెంగుళూరు! హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతున్న జనాలు!

సాధారణంగా బెంగుళూరు అంటేనే .. ఐటీ కి బెస్ట్ ప్లేస్. ఇతర రాష్ట్రాల్లో ఉండే చాలా మంది ఉపాధి కోసం బెంగుళూరుకు వెళ్తూ ఉంటారు, ముఖ్యంగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్లే వాళ్ళే అధికంగా ఉంటారు. హైదరాబాద్ తో పోల్చుకుంటే బెంగుళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయినా కూడా.. ఎక్కువమంది బెంగుళూరుకు వెళుతూ ఉంటారు. అయితే, మెట్రోపాలిటన్ సిటీ గా పేరు తెచ్చుకున్న బెంగుళూరు లో ఉండే ఇబ్బందులేంటో .. ప్రతి ఒక్కరికి తెలుసు.. ఎంత ఐటీ హబ్ కు బెస్ట్ ప్లేస్ అయినా కూడా.. అక్కడ ట్రాఫిక్, కాస్ట్ ఆఫ్ లివింగ్ , పొల్యూషన్ ఇలా అన్ని ఇబ్బందులే ఉంటాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మరో సమస్య వాటర్ లేకపోవడం. వేసవి కాలం ఇంకా పూర్తిగా మొదలవ్వకుండానే అక్కడ నీటి కొరత ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో ప్రజలంతా హైదరాబాద్ పై మక్కువ పెంచేస్కుంటున్నారట. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్ కు అధిక జనాభా భారం తప్పదా! దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతి ఏటా చదువు పూర్తి చేసుకుని లక్షల సంఖ్యలో విద్యార్థులు బయటకు వస్తున్నారు. వారంతా ఉద్యోగం కోసం బయటకు వెళ్ళేది అయితే బెంగుళూరు లేదా హైదరాబాద్. మెట్రోపాలిటన్ సిటీ లుగా పేరొందిన ఈ రెండు సిటీస్ కూడా .. గత కొన్నేళ్లుగా ఎంతో మంది ఐటీ ఉద్యోగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసమో.. డబ్బు వెనుక పరుగులు తీసే క్రమంలోనో చాలా మంది ఉద్యోగం కోసం తరలి వెళ్తుంటారు. అయితే, గత కొద్దీ రోజులుగా బెంగుళూరు ప్రజలను వేధిస్తున్న సమస్య నీటి కొరత. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రజలంతా నీటి కొరత కారణంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తలను ఇప్పటికప్పుడు మీడియా , సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న టెకీలు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. కొన్ని ప్రముఖ దిగ్గజ సంస్థలలోని ఉద్యోగులు ఆఫీసులకు రాలేక.. వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఇవ్వాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగుళూరు అంతా కూడా మెల్ల మెల్లగా ఖాళీ అవుతున్నట్లు.. అంతా కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగం కోసం బెంగుళూరు తర్వాత ఎక్కువమంది చూస్ చేసుకునే ఆప్షన్ హైదరాబాద్ మాత్రమే. బెంగుళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ , ట్రాఫిక్ సమస్యలు తక్కువగానే ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ లో జనాభా భారీగా పెరుగుతున్నారు.. ఇప్పుడు బెంగుళూరు నుంచి వచ్చేవారు కూడా హైదరాబాద్ ప్రాంతానికే తరలి వస్తే కనుక.. బెంగుళూరు లానే హైదరాబాద్ లో కూడా భారీ ట్రాఫిక్ కష్టాలు తప్పవని భావిస్తున్నారు. బెంగుళూరులో ఉండే ట్రాఫిక్ , పొల్యూషన్ కష్టాలు తెలియనివి కాదు. ఇప్పుడు దానికి తోడు నీటి కొరత కూడా ఏర్పడడంతో.. అక్కడ ఉన్న జనాలంతా హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నారట. ఒకేవేళ అదే కనుక నిజం అయితే.. హైదరాబాద్ పై ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుందని చెప్పి తీరాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే.. రానున్న రోజుల్లో భాగ్యనగరంపై భారం తప్పదనిపిస్తోంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి