iDreamPost

తండ్రైన మంచు మనోజ్.. ఎనౌన్స్ మెంట్ అదుర్స్

మంచువారబ్బాయి, సొట్ట బుగ్గల కుర్రాడు మంచు మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకోగా.. ఆమె గర్భిణీ అన్న సంగతి విదితమే. ఆమె తాజాగా ప్రసవించింది.

మంచువారబ్బాయి, సొట్ట బుగ్గల కుర్రాడు మంచు మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకోగా.. ఆమె గర్భిణీ అన్న సంగతి విదితమే. ఆమె తాజాగా ప్రసవించింది.

తండ్రైన మంచు మనోజ్..  ఎనౌన్స్ మెంట్ అదుర్స్

మంచు వారసుల్లో చిన్నవాడు.. సొట్ట బుగ్గల కుర్రాడు హీరో మంచు మనోజ్ కుమార్  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న తనయుడైన మనోజ్.. చైల్ట్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత శ్రీ అనే చిత్రంలో ఎంట్రీ ఇచ్చి వర్సటైల్ అండ్ జోయల్ అండ్ ఫన్ గాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రి తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ నటుడు మనోజ్. బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, రాజు భాయ్, కరెంట్ తీగ, పోటుగాడు, మిస్టర్ నూకయ్య, నేను మీకు తెలుసా? ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రాలు అతడి నటనేంటో చూపించాయి. వెండితెర నుండి బుల్లితెర మీదకు వచ్చి నవ్వులు పువ్వులు పూయించాడు.

ఇప్పుడు ఈ హీరో తండ్రయ్యాడు. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు పండంటి పాప జన్మించింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. ‘ఇప్పుడు మేం నలుగురు అయ్యాం. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మేమిద్దరం ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది.అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి (మనోజ్, మౌనిక) అని పిలస్తున్నాము. మా కుటుంబంపై ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భావిస్తున్నాను. వారిని ఆశీర్వదించండి’ అంటూ పోస్టర్ షేర్ చేశాడు. AIతో చేసిన పోస్టర్ అదుర్స్ అనిపిస్తుంది. పులి ఒడిలో పడుకున్న పాపతో పాటు నలుగురం అయ్యామని చెప్పే ఓ AI పిక్ షేర్ చేశాడు ఈ మంచువారబ్బాయి.

కాగా, మంచు మనోజ్ 2015లో ప్రణీత రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ ఈ దంపతులు 2019లో విడిపోయారు. 2023లో భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు మనోజ్. వీరిద్దరికీ ఇది రెండవ వివాహమే. గతంలో మౌనికకు వివాహం కాగా, ధైరవ్ జన్మించాడు. ప్రస్తుతం మనోజ్ ఉస్తార్ ర్యాంప్ ఆడిద్దాం అంటూ ఓ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో సెలబ్రిటీ వచ్చి సందడి చేస్తున్న సంగతి విదితమే. ఇందులో సెలబ్రిటీ వచ్చి సందడి చేస్తున్న సంగతి విదితమే. నాని, రానా, ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, రవితేజ, శర్వానంద్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేషు, సజ్జా తేజ వంటి స్టార్ హీరోలు అతిధులుగా విచ్చేశారు. వారిని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి.. ఫన్ క్రియేట్ చేసి.. షోను సూపర్ హిట్ చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి