iDreamPost

ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌.. 2 రోజుల్లో ఇంట్లో శుభకార్యం.. ఇంతలోనే

  • Published Jun 17, 2024 | 12:33 PMUpdated Jun 17, 2024 | 1:13 PM

ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నారు. రెండు రోజుల్లో వారి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఎంతో బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నారు. రెండు రోజుల్లో వారి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jun 17, 2024 | 12:33 PMUpdated Jun 17, 2024 | 1:13 PM
ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌.. 2 రోజుల్లో ఇంట్లో శుభకార్యం.. ఇంతలోనే

ఆమె స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా చేస్తూ.. ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. మరో రెండు రోజుల్లో వారి ఇంట్లో శుభకార్యం నిర్వహించనున్నారు. ఆ పనులతో ఇంటిల్లిపాది బిజీగా ఉన్నారు. ఇప్పటికే బంధువులు, స్నేహితులకు ఆహ్వానాలు వెళ్లాయి. దగ్గరి బంధువులు కొందరు వచ్చేశారు కూడా. మరి కొన్ని గంటల్లో మేళతాళాలతో అంగరంగ వైభవంగా శుభకార్యం నిర్వహించాల్సిన ఇంట్లో చావు మేళం మోగింది. స్కూల్‌ ప్రిన్సిపాల్‌గా ఎంతో బాధ్యతగా మెలుగుతూ.. ఎందరో అభిమానం సంపాదించుకున్న ఆమె అత్యంత దారుణ నిర్ణయం తీసుకుంది. దాంతో శుభకార్య జరగాల్సిన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అసలింతకు ఏం జరిగిందంటే..

రెండో రోజుల్లో కుమార్తె శారీ ఫంక్షన్‌ చేయాలని.. ఆ ఏర్పాట్లతో బిజీగా ఉన్న తల్లి.. ఉన్నట్లుండి దారుణ నిర్ణయం తీసుకుంది. ఆత్యహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడకు చెందిన స్నేహశీల ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తోంది. స్నేహశీలకు 2010లో వివాహం అయ్యింది. మందమర్రికి చెందిన మహేష్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు ఇద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వత నుంచి వారి ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.

మహేష్‌ ఏం పని చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. కుటుంబ పోషణ భారం స్నేహశీల మీద పడింది. దాంతో ఆమె ప్రైవేటు స్కూల్‌ టీచర్‌గా పని చేసేది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం స్నేహశీల దంపతులు.. మంథనిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలను లీజుకు తీసుకుని నడిపించారు. కానీ నష్టపోయారు. ప్రస్తుతం స్నేహశీల లక్షేట్టిపేట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో మహేష్‌ మద్యానికి బానిసై.. భార్యను అనుమానించడమే కాక.. ఆమె పుట్టింటి వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించేవాడు. దీనిపై ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి.. పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లారు.

ఈ క్రమంలో స్నేహశీల కుమార్తెకు శారీ ఫంక్షన్‌ చేయడం కోసం తెలిసిన వారి వద్ద నుంచి 80 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. మరో రెండో రోజుల్లో ఫంక్షన్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే బంధువులు, స్నేహితులు, తోటి ఉపాధ్యాయులను ఆహ్వానించింది. ఫంక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి స్నేహశీల భర్త మహేష్‌ డబ్బుల కోసం ఆమెతో గొడవకు దిగాడు. ఫంక్షన్‌ కోసం తెచ్చిన డబ్బులను తనకు ఇవ్వాలని.. శుభకార్య చేయాల్సిన అవసరం లేదని గొడవ చేశాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన స్నేహశీల.. శనివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కిందకు దించి.. ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే స్నేహశీల మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. భర్త మహేష్‌ వేధింపుల వల్లే.. స్నేహశీల మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నారు. స్నేహశీల తీసుకున్న నిర్ణయంతో శుభకార్య జరగాల్సిన ఇంట చావు మేళం మోగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి