iDreamPost
android-app
ios-app

Premalu: తెలుగులోకి మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు..రిలీజ్ డేట్ ఇదే!

  • Published Feb 26, 2024 | 2:24 PMUpdated Feb 26, 2024 | 2:24 PM

ఇటీవల మలయాళంలో సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమా ప్రేమలు. అయితే, తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల మలయాళంలో సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమా ప్రేమలు. అయితే, తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 26, 2024 | 2:24 PMUpdated Feb 26, 2024 | 2:24 PM
Premalu: తెలుగులోకి మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు..రిలీజ్ డేట్ ఇదే!

తాజాగా మలయాళంలో సూపర్ సక్సెస్ సాదించిన సినిమా “ప్రేమలు”. ఇక తెలుగు సినీ అభిమానుల సంగతి తెలిసిందే కదా.. ఆ సినిమాలో కథ , స్క్రీన్ ప్లే బావుంటే .. భాషతో సంబంధం లేకుండా .. ఆ సినిమాను ప్రేమించేస్తుంటారు. ఈ క్రమంలోనే మలయాళీ సినిమా అయినా “ప్రేమలు” సినిమాను కూడా అంతే ప్రేమించారు. ఇది మలయాళీ సినిమా అయినప్పటికి.. ఈ చిత్రంలో ఉన్న కామెడీ, ప్రేమ కథ తెలుగు ప్రేక్షకులను బాగా అట్ట్రాక్ట్ చేసింది. ఇటు హైదరాబాద్ లో దాదాపు అన్ని మల్టీప్లెక్స్ లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ అయిందనే టాక్ వినిపించింది. అయితే, తెలుగులో లేకుండానే .. తెలుగు ఆడియన్స్ లో ఇంత క్రేజ్ తెచ్చుకున్న సినిమా .. ఒకవేళ తెలుగులో డబ్ అయితే, ఇంకా ఈ సినిమా క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కు సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి తెలుసుకుందాం. .

అయితే, సాధారణంగా మలయాళీ ప్రేమ కథలకు .. తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా అట్ట్రాక్ట్ అవుతుంటారు. గతంలో కొన్ని మలయాళీ సినిమాలను తెలుగులో రీమేక్ చేసిన తర్వాత.. ఏ రేంజ్ లో హిట్ సాధించాయని విషయాలను.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అదే తరహాలో టాక్ నడుస్తున్న మలయాళీ సినిమా “ప్రేమలు”. తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఉంటుందా ఉండదా అనే చర్చలు కూడా నడిచాయి. కొంతమంది మాత్రం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ చేస్తే.. ఈ సినిమాలో ఉన్న ట్రూ ఫ్లేవర్స్ మిస్ అవుతాయని కూడా అన్నారు. కానీ, వీటిన్నటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఈ సినిమా తెలుగు వెర్షన్ పై .. మేకర్స్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. అందరు ఊహించినట్లుగానే తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను చూసి.. మేకర్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ ను ఆల్రెడీ స్టార్ట్ చేసేశారట.  ఈ క్రమంలో  “ప్రేమలు” తెలుగు వెర్షన్ ను మార్చి 8న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం.

ఒకవేళ తెలుగు వెర్షన్ లో కనుక అనుకున్న టైం కి ఈ సినిమా రిలీజ్ అయితే.. మరింత మంది తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసి ఫిదా అవ్వడం కన్ఫర్మ్ అని చెప్పి తీరాలి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు కు ప్రత్యేకమైన ప్రశంసలు దక్కాయి. ఆ సినిమా తర్వాత తెలుగులోను ఈ అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. కాగా “ప్రేమలు” సినిమాకు డైరెక్టర్ గిరీష్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా.. మొదటి వారంలోనే 6 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. అయితే, ఈ సినిమాలో హైదరాబాద్ లోని ఐటీ ప్రొఫెషనల్స్ లైఫ్ స్టైల్ ను చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు.. ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. మరి, “ప్రేమలు” సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి