Uppula Naresh
Uppula Naresh
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రిని అతని కూతురు చంపాలని స్కెచ్ వేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఆ యువతి కనిపెంచిన తండ్రిని ఎందుకు హత్య చేయాలని చూసింది. ఇంతకు ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లా మధలో మహేంద్ర షా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా బడా వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. ఇతనికి సాక్షి అనే కూతురు ఉంది. చిన్నప్పటి నుంచి కూతురుని మహేంద్ర షా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. అయితే ఆ యువతి స్థానికంగా ఉండే చైతన్య అనే యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఇటీవల మహేంద్ర షాకు కూతురి ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో తండ్రి కోపంతో కూతురు సాక్షికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి బుద్దిగా ఉండాలంటూ సూచించాడు.
ప్రేమకు అడ్డు రావడంతో సాక్షికి తండ్రిపై ఎక్కడలేని కోపం కట్టలు తెంచుకుంది. ఇలా అయితే కాదని భావించిన ఆ యువతి.. ఏకంగా తండ్రి హత్యకు ప్లాన్ గీసింది. ఇదే విషయాన్ని తన ప్రియుడికి చెప్పడంతో అతడు కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగానే సాక్షి రూ.60 వేలు సుపారీ ఇచ్చి తండ్రి హత్యకు స్కెచ్ వేసింది. పథకం ప్రకారమే సాక్షి ఆదివారం మధకు వెళ్లింది. రాత్రిపూట ఓ చోట బస్సు దిగి తండ్రికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. దీంతో తండ్రి మహేంద్ర షా కూతురు చెప్పిన చోటుకు వెళ్లాడు. ఇక తండ్రి కూతురు తిరుగు ప్రయాణంలో భాగంగా సాక్షి ఓ చోట కారు ఆపమని కోరి కిందకు దిగింది.
ఈ క్రమంలోనే నలుగురు యువకులు వచ్చి కారులో ఉన్న సాక్షి తండ్రి మహేంద్ర షాపై దాడి చేశారు. అతని రెండు కాళ్లు విరగొట్టి తలపై బలంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మహేంద్ర షా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఎట్టకేలకు తండ్రి హత్యకు కూతురు సాక్షి ప్లాన్ వేసిందని పోలీసులు అసలు నిజాలను రాబట్టారు. దీంతో పోలీసులు వెంటనే సాక్షితో పాటు మరో నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మహేంద్ర షా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇది కూడా చదవండి: AP: ప్రాణం పోతున్నా.. పాక్కుంటూ వెళ్లి భార్యను హత్తుకుని ధైర్యం చెప్పి