iDreamPost

Mad Square: ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది! ‘మ్యాడ్ స్క్వేర్’కు కొబ్బరికాయ కొట్టారు!

  • Published Apr 19, 2024 | 9:15 PMUpdated Apr 19, 2024 | 9:15 PM

ఈ సమ్మర్​లో తెలుగు నాట ‘టిల్లు స్క్వేర్’ హవా నడిచింది. ఈ సీక్వెల్ మూవీతో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది.. ‘మ్యాడ్ స్క్వేర్​’కు కొబ్బరికాయ కొట్టారు.

ఈ సమ్మర్​లో తెలుగు నాట ‘టిల్లు స్క్వేర్’ హవా నడిచింది. ఈ సీక్వెల్ మూవీతో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది.. ‘మ్యాడ్ స్క్వేర్​’కు కొబ్బరికాయ కొట్టారు.

  • Published Apr 19, 2024 | 9:15 PMUpdated Apr 19, 2024 | 9:15 PM
Mad Square: ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది! ‘మ్యాడ్ స్క్వేర్’కు కొబ్బరికాయ కొట్టారు!

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా ఒకటి సక్సెస్ అయితే దాన్ని ఇతరులు కూడా రిపీట్ చేయడం సర్వసాధారణం. ఇక్కడ సెంటిమెంట్లు బాగా నమ్ముతుంటారు. సెంటిమెంట్లతో పాటు ట్రెండ్​ను ఫాలో అవడం కూడా కామనే. ఇప్పుడు అలాంటి ఓ ట్రెండ్​ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్​టైన్​మెంట్స్ అనుసరిస్తోంది. ఈ ప్రొడక్షన్ హౌజ్ నిర్మించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ వేసవిలో మస్తు వినోదాన్ని పంచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేసిన ఈ సినిమా నుంచి ఓ విషయాన్ని సితార ఎంటర్​టైన్​మెంట్స్ రిపీట్ చేస్తోంది. అదే సీక్వెల్ టైటిల్. ‘డీజే టిల్లు’ సీక్వెల్​ మూవీకి ‘టిల్లు స్క్వేర్’ అని నామకరణం చేసింది. మామూలుగా సీక్వెల్స్​కు పెట్టేలా కాకుండా డిఫరెంట్​గా టైటిల్ పెట్టింది. దీన్నే ‘మ్యాడ్’ మూవీ సీక్వెల్​కూ ఫాలో అయిపోయింది.

యంగ్ డైరెక్టర్స్​తో డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తూ వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉంది సితార ఎంటర్​టైన్​మెంట్స్. ఈ బ్యానర్ నుంచి ఇప్పుడు మరో సీక్వెల్ మూవీ రానుంది. కొత్త యాక్టర్స్, టెక్నిషియన్స్​తో ఈ సంస్థ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం అక్టోబర్, 2023లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా ‘మ్యాడ్ స్క్వేర్​’ను రెడీ చేస్తున్నారు మేకర్స్. ‘మ్యాడ్​’తో రైటర్-డైరెక్టర్​గా ఇంట్రడ్యూస్ అయిన కళ్యాణ్ శంకరే సీక్వెల్​ను కూడా తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్​లో నటించి మెప్పించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్​లు సెకండ్ పార్ట్​లోనూ యాక్ట్ చేయనున్నారు. అయితే హీరోయిన్లు మాత్రం చేంజ్ అవుతారట. ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభోత్సవానికి సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ కేవీ అనుదీప్ స్పెషల్ గెస్ట్​లుగా అటెండ్ అయ్యారు.

దర్శకుడు కళ్యాణ్​ శంకర్​కు స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ.. మూవీ యూనిట్​కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె, ఆయన సోదరీమణులు హారిక, హాసిని కూడా హాజరయ్యారు. ‘మ్యాడ్’ కోసం పనిచేసిన టెక్నీషియన్స్ సీక్వెల్ కోసం మళ్లీ కలసి వర్క్ చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్​’కు శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించనున్నారు. ఇక, ఈ సినిమాతో టాలీవుడ్​లో మరో ట్రెండ్ మొదలైందనే చెప్పాలి. గతంలో సీక్వెల్ చిత్రాలకు పేరు చివరలో 2 లేదా రిటర్న్స్ ఇలా కొన్ని అలవాటైన టైటిల్స్ పెట్టేవారు. కానీ ‘డీజే టిల్లు’ సీక్వెల్​కు ‘టిల్లు స్క్వేర్​’ పెట్టి సితార ఎంటర్​టైన్​మెంట్స్ కొత్త ట్రెండ్​కు తెరలేపింది. ఇప్పుడు ‘మ్యాడ్’ సీక్వెల్​కు ‘మ్యాడ్ స్క్వేర్’ అనే పేరు పెట్టి ఆ ట్రెండ్​ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. మరి.. ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి