iDreamPost
android-app
ios-app

Salaar Bike: ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. ఇలా చేస్తే చాలు ప్రభాస్ నడిపిన ‘సలార్’ బైక్ మీ సొంతం!

  • Published Apr 19, 2024 | 5:22 PM Updated Updated Apr 19, 2024 | 5:22 PM

సలార్ నిర్మాతలు అభిమానులకు బంపరాఫర్ ప్రకటించారు. ఇలా చేస్తే చాలు.. సలార్ మూవీలో ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం అవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సలార్ నిర్మాతలు అభిమానులకు బంపరాఫర్ ప్రకటించారు. ఇలా చేస్తే చాలు.. సలార్ మూవీలో ప్రభాస్ నడిపిన బైక్ మీ సొంతం అవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 19, 2024 | 5:22 PMUpdated Apr 19, 2024 | 5:22 PM
Salaar Bike: ఈ ఛాన్స్ మళ్లీ రాదు.. ఇలా చేస్తే చాలు ప్రభాస్ నడిపిన ‘సలార్’ బైక్ మీ సొంతం!

‘సలార్’.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గతేడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 21(ఆదివారం) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతోంది. ఈ సందర్భంగా ఫిల్మ్ మేకర్స్ ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు. గురువారం హోంబలే ఫిల్స్మ్ ప్రొడక్షన్ హౌస్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ఇలా చేస్తే చాలు సలార్ మూవీలో ప్రభాస్ నడుపుతున్న బైక్ మీ సొంతం అంటూ గివ్ అవే డీటైల్స్ ఇచ్చింది. మరి ఈ బైక్ మీ సొంతం కావాలంటే ఏం చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

సలార్ మూవీలో ప్రభాస్ చాలా సీన్లలో స్టైలిష్ బైక్ నడుపుతూ మనకు కనిపిస్తాడు. దీంతో ఫ్యాన్స్ కు ఈ బైక్ తెగ నచ్చేసింది. ఇక ఇప్పుడు మీరు నచ్చిన, మెచ్చిన ఆ బైక్ ను మీ సొంతం చేసుకునే అవకాశాన్ని హోంబలే ఫిల్మ్స్ మీకు కల్పిస్తోంది. ప్రభాస్ నడిపిన సలార్ బైక్ మీరు గెలుచుకోవాలంటే క్రింద చెప్పిన విధంగా చేయాలి. ఇక ఈ కాంపీటిషన్ లో గెలిచిన లక్కీ విన్నర్ కు డార్లింగ్ సలార్ లో నడిపిన బైక్ ను అందజేస్తారు. ఇంతకీ ఏం చేయాలంటే?

మీరు చేయాల్సిందేంటంటే? ఏప్రిల్ 21(ఆదివారం) సాయంత్ర 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టార్ మా ఛానెల్ లో సలార్ మూవీ ప్రసారం అవుతుంది. ఇక ఈ మూవీ టైమ్ లో స్క్రీన్ ఎడమ వైపున బైక్ ఇమేజ్ లు వస్తాయి. ఈ బైక్ ఇమేజ్ లు మూవీ పూర్తి అయ్యేలోగ ఎన్ని సార్లు కనిపించాయో లెక్కించాలి. అలా లెక్కించిన దాన్ని SMS లైన్స్ ఓపెన్ అయినప్పుడు, SALAAR <space> <స్క్రీన్‌పై బైక్‌ ఎన్ని సార్లు కనిపించిందో ఆ సంఖ్య> టైప్‌ చేసి 9222211199కి SMS పంపండి. 2024 ఏప్రిల్ 21న రాత్రి 8 గంటల నుంచి SMS లైన్స్ ఓపెన్‌ అవుతాయి. టెర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. ఈ సూపర్ ఆఫర్ ను మిస్ కావొద్దని నిర్మాణ సంస్థ తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom