iDreamPost

మీరు లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ వాడుతున్నారా? అయితే ఆ డేంజర్ లో పడినట్లే..

Listerine Mouthwash: ప్రస్తుత కాలంలో సమయం లేక కొందరు,బద్దకంతో మరికొందరు పళ్లు తోమడానికి బదులుగా సులభంగా ఉంటుందని లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్లను వాడుతున్నారు. కానీ ఇవి మనిషిని ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నాయట.

Listerine Mouthwash: ప్రస్తుత కాలంలో సమయం లేక కొందరు,బద్దకంతో మరికొందరు పళ్లు తోమడానికి బదులుగా సులభంగా ఉంటుందని లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్లను వాడుతున్నారు. కానీ ఇవి మనిషిని ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నాయట.

మీరు లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ వాడుతున్నారా?  అయితే ఆ డేంజర్ లో పడినట్లే..

నేటి ఆధునిక ప్రపంచంలో మౌత్ ఫ్రెషనర్ల వాడకం బాగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది ఉదయం బ్రేష్ చేయడానికి బద్దకంతో లిక్విడ్ మౌత్ ప్రేషనర్లను వాడుతుంటారు. అలానే మరికొందరు భోజనం తర్వాత నోటి దుర్వాసనను లేకుండా రిఫ్రెష్ అనుభూతిని ఆస్వాదించడానికి మౌత్ ఫ్రెష్‌నర్‌ల వైపు మొగ్గు చూపుతారు. అవి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాస్తు మీ నోటిలో ఆహ్లాదకరమైన రుచిని కలిగి ఉంటాయి. అలా వీటిని ఉపయోగిస్తున్న వారికి ఓ కీలక హెచ్చరిక. అది కూడా జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజీ హెచ్చరిస్తోంది. లిక్విడ్ మౌత్ ఫ్రెనర్ల కారణం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రస్తుత కాలంలో సమయం లేక కొందరు,బద్దకంతో మరికొందరు పళ్లు తోమడానికి బదులుగా సులభంగా ఉంటుందని లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్లను వాడుతున్నారు. చాలా సులభంగా నోట్లో పోసుకొని పుక్కిలిస్తుంటారు. తద్వారా బ్రష్ చేయకుండా సరిపెట్టుకుంటున్నారు. కానీ ద్రవ మౌత్ ఫ్రెష్నర్ లో ఉండే లిస్టెరిన్ అనే రసాయనం క్యాన్సర్ వ్యాధికి దారి తీస్కుందని జర్నల్ ఆఫ్ మెడికల్ మైక్రో బయాలజీ హెచ్చరిస్తోంది. లిస్టెరిన్ రసాయనం చిగురు పళ్ల సమస్యలు, అన్నవాహిక ప్రాంతంలో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు కారణమైతుందని శాస్త్రవేత్తల రీసెర్చ్  లో తేలింది.  అంతేకాక వీరి పరిశోఓధనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ లో ఉండే రసాయనం కారణంగా నోటిలో బ్యాక్టీరియా కూడా పెరిగిపోతుందని మరో రీసెర్చ్ లో తెలింది. ఫ్యూసోబాక్టీరియం న్యూక్లియేటం, ఆంజినోససులు బ్లడ్ లో కలిసి నోటి సమస్యలకు కారణం అవుతాయట. రోజూ లిస్టెరిన్ వాడటం వల్ల రెండు రకాల బాక్టీరియా నోట్లో పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటిలోని చిగుళ్ల వాపు, ఇన్ఫెషన్లు కూడా  లిస్టెరిన్ కెమికల్ కారణంగానే వస్తాయని వారి రీసెర్చ్ లో వెల్లడైంది. ప్రతి ఒక్కరికి నోటి, గొంతు ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. కారణం.. ఆహారం ప్రారంభయ్యేది ఇక్కడి నుంచి. అంతేకాక జీర్ణక్రియ ప్రక్రియ అంతా నోటి నుంచి మొదలవుతుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి.. అందు కోసం రెగ్యెలర్ బ్రషింగ్, ఫ్లాషింగ్, దంతాల పరీక్షలు  చేయించుకుంటూ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం లిక్విడ్ మౌత్ ఫ్రెష్నర్ల కారణంగా క్యాన్సర్ రిస్క్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి