iDreamPost

చైనా అద్భుత సృష్టి.. ఈ చికిత్సతో షుగర్ పూర్తిగా నయం అవుతుందట?

China, Cell Therapy: ఇటీవల కాలంలో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని కారణంగా బాధితులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే తాజాగా చైనా ఓ అద్భుతాన్ని సృష్టించిన సమాచారం

China, Cell Therapy: ఇటీవల కాలంలో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని కారణంగా బాధితులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే తాజాగా చైనా ఓ అద్భుతాన్ని సృష్టించిన సమాచారం

చైనా అద్భుత సృష్టి.. ఈ చికిత్సతో షుగర్ పూర్తిగా నయం అవుతుందట?

నేటికాలంలో మధుమేహంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కారణం ఏమైనప్పటికి నేటికాలంలో వయస్సుతో సంబంధంలేకుండా ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది. దీంతో ఎంతో మంది మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పూర్తి స్థాయి చికిత్స లేక.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు బాధితులు వివిధ రకాల మందులు, ఇంజెక్షన్లు తీసుకుంటారు. అయితే తాజాగా చైనా ఓ అద్భుతాన్ని సృష్టించిన సమాచారం. ఈ షుగర్ వ్యాధిని పూర్తి స్థాయిలో నయం చేసే చికిత్సను కొనుగొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇటీవల కాలంలో మధుమేహంతో బాధ పడే వారి సంఖ్య బాగా పెరిగింది. దీని కారణంగా బాధితులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. శరీరంలోని పలు అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డయాబెటిస్ ముదిరితే గుండె, కిడ్నీ వంటి సమస్యలు ఏర్పడుతాయి. దీంతో షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకునేందుకు బాధితులు అనేక చికిత్సలు తీసుకుంటున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సెల్ థెరపీ అనే కొత్త చికిత్స్ అందుబాటులోకి వచ్చింది. ఈ థైరపీ ద్వారా టాబ్లెట్లు, ఇన్సులిన్ ఇంజెక్షన్ల వినియోగించే బాధ తప్పేఅవకాశం ఉంది. చైనా శాస్త్రవేత్తలు సెల్ థెరపీతో డయాబెటిస్ నయం చేశారు. అయితే ఈ ప్రక్రియ ఇంక ప్రాథమిక దశలో ఉందని అక్కడి వైద్యులు వెల్లడించారు.

సెల్ థెరపీ ద్వారా షుగర్ బాధితులకు పెరిపెరల్ బ్లడ్ మోనో న్యూక్లియర్ కణాలను సీడ్ కణాలుగా మారుస్తారు. ప్యాంక్రియాట్ ఐలెట్ కణాలను కూడా పునరుత్పతి చేశారు. ఈ చికిత్స ద్వారా షుగర్ ను అదుపు చేశారు. ఈ థైరపీ ద్వారా ఎలాంటి చెడు ప్రభావం కూడా ఉండవని డాక్టర్లు వెల్లడించారు. ఇక కొత్త విధానానికి సంబంధించి ఫస్ట్ స్టేజ్  ప్రయోగం సక్సెస్ అయ్యిందని స్థానిక వైద్యులు తెలిపారు. ఇంకా మరికొన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి సమాచారం.

అవి కూడా విజయవంతమైతే సైల్ థెరపీ విధానం అమల్లోకి రానుంది. గత 25 ఏళ్లుగా చైనా వైద్యులు సెల్ థెరపీ పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు.  ఓ 59 ఏళ్ల షుగర్ పేషంట్ పై ఈ ప్రయోగం ప్రారంభించారు. అనేక వివిధ స్టేజ్ లో చికిత్సను అందించడం ద్వారా అతడు మధుమేహాం నుంచి కోలుకున్నాడు. మొత్తంగా ఈ చికిత్స అనేది త్వరలో అందుబాటులోకి రానుందని చైనా వైద్యులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి