iDreamPost

ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. అందరి ఫోకస్ వాటిపైనే!

List of Upcoming Movies: యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

List of Upcoming Movies: యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి.

ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి.. అందరి ఫోకస్ వాటిపైనే!

జనాలను ఎంటర్ టైన్ చేసే వాటిల్లో సనిమాలు కూడా ఒకటి. థియేటర్లకు వెళ్లి మూవీస్ చూస్తూ.. ప్రేక్షకులు ఎంటర్ టైన్ అవుతుంటారు. ఇక సినీ లవర్స్ అయితే వారం వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాల కోసం ఎదురు చూడటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వాటి కంటే ముందు ఏమైనా చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ప్రతి వారం థియేటర్లలో ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. అలానే ఈవారం  కూడా  కొన్ని సినిమాలు థియేటర్లో సందడి చేయనున్నాయి. మరి.. ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక కల్కి వచ్చేందుకు వారం టైమ్ ఉంది. ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉంటాయి. ఇక కల్కి బాక్సాపీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఓ రెండు వారాలు మరే ఇతర సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే కొన్ని చిన్న మూవీలకు ఈ జూన్ 21న చివరి వారమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అలానే ఇప్పటిక వరకు పలు చిన్న చిత్రాలు విడుదల కాగా.. ఈ క్రమంలోనే ఈ వారం మరికొన్ని సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అలా ఈవారం రాబోయే సినిమాల్లో యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన నింద మూవీపైనే అందరి ఫోకస్ ఉంది. చాలా గ్యాప్ తరువాత కొత్తగా ట్రై చేస్తున్నాడనే టాక్ తో నిందతో వరుణ్ సందేశ్ థియేటర్లలోకి వస్తున్నారు.  ఆ తరువాత టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్, నందిత శ్వేతలు ప్రధాన పాత్రలో నటించిన ఓఎంజీ(ఓ మంచి ఘోస్ట్) కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. అలానే కొత్త టీంతో చేసిన సీతా కళ్యాణ వైభోగమే, చైతన్య రావ్, హెబ్బా పటేల్ నటించిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఇలా పలు చిన్న చిత్రాలు వరుస పెట్టి విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

ఈ సినిమాల్లో వరుణ్ సందేశ్ చేస్తున్న నింద మూవీ అయితే యధార్థ సంఘటనల ఆధారంగా తెరక్కెకించారు. నింద టీజర్, ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని రాజేష్ జగన్నాధం నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఇక వెన్నెల కిషోర్ ఓఎంజీ మూవీ అయితే హర్రర్ కామెడీ గా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో షకలక శంకర్, రఘుబాబు వంటి వారు నటించారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే కూడా బాగానే నవ్వించి, భయపెట్టేలా కనిపించాయి. సీతా కళ్యాణ వైభోగమే  సినిమాతో కొత్త హీరో హీరోయిన్లు పరిచయం కాబోతోన్నారు. ఇవే కాకుండా చైతన్య రావ్ హనీమూన్, సందేశం వంటి చిత్రాలు కూడా బరిలోకి దిగనున్నాయి. మొత్తంగా పలు చిన్న సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి.. వీటిలో ఏవి సక్సెస్ గా నిలుస్తాయో తెలియాలంటే.. కొన్ని రోజులు ఎదురు చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి