iDreamPost

LIC లో అద్భుతమైన పాలసీ.. రూ.500 పెట్టుబడితో రూ.కోటి బెనిఫిట్

  • Published Apr 15, 2024 | 2:08 PMUpdated Apr 15, 2024 | 2:08 PM

తక్కువ పెట్టుబడితో భారీ ఎత్తున ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా.. మీ కోసమే ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఆ వివరాలు..

తక్కువ పెట్టుబడితో భారీ ఎత్తున ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారా.. మీ కోసమే ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్ ని తీసుకు వచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 15, 2024 | 2:08 PMUpdated Apr 15, 2024 | 2:08 PM
LIC లో అద్భుతమైన పాలసీ.. రూ.500 పెట్టుబడితో రూ.కోటి బెనిఫిట్

ప్రస్తుత కాలంలో పొదుపు అనేది కచ్చితంగా మారింది. నెలవారీ జీతం పొందే వాళ్లైనా.. రోజు వారీ కూలీలైనా సరే కచ్చితంగా పొదుపు పథకాల్లో చేరుతున్నారు. ఇక ప్రతి నెల పెట్టుబడి పెడుతూ.. దీర్ఘ కాలంలో మంచి లాభాలు అందించే పథకాలు, స్కీమ్ లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఇలాంటి పథకాలను అందుబాటులోకి తేవడంలో ముందు వరుసలో ఉంటుంది. చిన్న మొత్తాల పెట్టుబడితో.. దీర్ఘకాలంలో భారీ లాభాలు ఇచ్చే పథకాలను తీసుకొస్తుంది. ఇక తాజాగా ఇలాంటి స్కీమ్ నే అందుబాటులోకి తెచ్చింది ఎల్ఐసీ. దీనిలో 500 పెట్టుడితో రూ.కోటి వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఆ వివరాలు..

మీరు నెలవారీ పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఎల్‌ఐసీ మీ కోసం అద్భుతమైన స్కీమ్ ను తీసుకొచ్చింది. వీటిలో పెట్టుబడి తక్కువ పైగా అధిక రాబడిని కూడా అందిస్తుంది. రోజుకు 500 రూపాయల పెట్టుబడితో మీరు కోటి వరకు బెనిఫిట్ పొందే.. ఎల్‌ఐసీ కరోడ్‌పతి లైఫ్ బెనిఫిట్‌ స్కీమ్ ను తీసుకొచ్చింది ఎల్ఐసీ. ఈ పథకంలో చేరితే మీరు 1 కోటి రూపాయల వరకు తిరిగి పొందుతారు.

ఈ పాలసీలో మీరు రోజుకు 500 రూపాయల చొప్పున నెలకు సుమారు రూ.15 వేలు డిపాజిట్ చేయాలి. ఇలా 16 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. అంటే మీరు కేవలం 30 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత 1 కోటి రూపాయలను రాబడిగా పొందుతారు. ఎల్‌ఐసీ తెచ్చిన ఈ పాలసీ వ్యవధి 25 సంవత్సరాలు. అయితే మీరు కేవలం 16 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 9 సంవత్సరాల వాయిదాను ఎల్‌ఐసీనే చెల్లిస్తుంది.

ఇక పాలసీలో మీరు 16 సంవత్సరాల పాటు డబ్బు డిపాజిట్ చేసి.. ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు మెచ్యూరిటీ కోసం వేచి ఉండాలి. ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్న తర్వాత పాలసీ మొత్తంతో పాటు, మీ కుటుంబానికి రూ. 40 లక్షల బీమా, రూ. 80 లక్షల వరకు ప్రమాద రక్షణ లభిస్తుంది. అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే.. అతడి కుటుంబానికి రూ. 80 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. కనుక మీరు తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలంటే.. ఈ స్కీమ్ లో చేరడం మంచిది అంటున్నారు నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి