iDreamPost

Kurup Report : కురుప్ సినిమా రిపోర్ట్

Kurup Report : కురుప్ సినిమా రిపోర్ట్

మహానటి. కనులు కనులు దోచాయంటేతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా కురుప్ నిన్న భారీ విడుదల అందుకుంది. కేరళలో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ దక్కగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని విధంగా చాలా చోట్ల డీసెంట్ ఫిగర్స్ నమోదయ్యాయి. కరుడు గట్టిన మాఫియా గ్యాంగ్ స్టర్ బయోపిక్ గా రూపొందిన ఈ సినిమా మీద దుల్కర్ అభిమానులే కాక రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా అంచనాలు పెట్టుకున్నారు. శోభిత ధూళిపాళ తప్ప తెలుగు ఆర్టిస్టులు తెలిసున్న మొహాలు ఏవీ లేకపోయినా కంటెంట్ మీద నమ్మకంతో జనాన్ని థియేటర్ల దాకా రప్పించిన కురుప్ నిజంగా తన రేంజ్ కి తగ్గట్టు ఉన్నాడో లేదో రిపోర్ట్ లో చూద్దాం

చిన్నప్పటి నుంచి నిలకడతత్వం లేని గోపికృష్ణ కురుప్(దుల్కర్ సల్మాన్)వయసొచ్చాక ఎయిర్ ఫోర్స్ లో చేరతాడు. కానీ అక్కడున్న కఠినమైన పరిస్థితులు, అధికారుల వేధింపులు తట్టుకోవడం అతని వల్ల కాదు. శారదాంబ(శోభిత ధూళిపాళ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇలా ఉంటే కష్టమని గుర్తించిన కురుప్ స్నేహితుల సహాయంతో ఓ వ్యక్తిని హత్య చేసి తాను చనిపోయినట్టుగా ఆధారాలు సృష్టిస్తాడు. సుధాకర్ గా పేరు మార్చుకుని రకరకాల మోసాలు, నేరస్తులతో స్నేహాలు మొదలుపెడతాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పోలీసులకు మాత్రం దొరకడు. చివరికి అతను ఏమయ్యాడు, ఎక్కడికి చేరుకున్నాడు అనేది స్క్రీన్ మీద చూడాలి.

ఇది పూర్తిగా దుల్కర్ షో. కురుప్ గా పరకాయప్రవేశం చేసి అదరగొట్టడు. మిగిలినవి ఎలా ఉన్నా పర్లేదు ఈ ఒక్క కారణం చాలు అనుకుంటే ఈ సినిమాని థియేటర్లో చూడొచ్చు. అలా కాదు అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు. బాగా సాగదీసిన స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ మొత్తం విసిగించే కురుప్ సెకండ్ హాఫ్ లో బోలెడు ట్విస్టులు పెట్టాడు. కానీ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని జొప్పించడంతో సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతూ విపరీతమైన కన్ఫ్యూజన్ కి గురి చేస్తాయి. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్ చాలా మటుకు కాపాడాయి కానీ దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ చాలా తెలివిగా కథను చెప్పాననుకుని అనవసరమైన అయోమయానికి గురి చేస్తాడు. స్ట్రెయిట్ నేరేషన్ చేసినా ల్యాగ్ తగ్గి ఎంగేజ్ అయ్యే అవకాశం పెరిగేది. ఓవరాల్ గా కురుప్ అంచనాలు అందుకోని మాట వాస్తవం

Also Read : Pushpaka Vimanam : పుష్పక విమానం రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి