iDreamPost

Salute : పాన్ ఇండియా సినిమాలకు కొత్త టెన్షన్

Salute : పాన్ ఇండియా సినిమాలకు కొత్త టెన్షన్

సంక్రాంతి 2022 అనుకున్న దానికన్నా వేడిగా మారుతోంది. రకరకాల సమీకరణాలు చర్చలు వాయిదాల తర్వాత ఫైనల్ గా ఎన్ని సినిమాలు బరిలో ఉంటాయనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. జనవరి 7 ఆర్ఆర్ఆర్, 14 రాధే శ్యామ్ ఇప్పటిదాకా ఫిక్స్ చేసుకుని థియేటర్లను లాక్ చేసుకున్న చిత్రాలు. అజిత్ వలిమై కూడా కన్ఫర్మ్ కానీ డేట్ ఇంకా చెప్పలేదు. నాగార్జున బంగార్రాజు వచ్చే తీరుతుందని అన్నపూర్ణ వర్గాలు అంటున్నాయి. ఇవాళో రేపో అనౌన్స్ మెంట్ వస్తుంది. అంటే ఇవన్నీ కలిపి నాలుగయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటికి థియేటర్లను అడ్జస్ట్ చేయడమే డిస్ట్రిబ్యూటర్లకు తలకు మించిన భారంగా మారింది. పంచడం సవాల్ గా నిలిచింది.

ఇప్పుడివి చాలవన్నట్టు దుల్కర్ సల్మాన్ సెల్యూట్ కూడా జనవరి 14 రిలీజ్ ని అఫీషియల్ గా చెప్పేసింది. ఇది రాధే శ్యామ్ వస్తున్న డేట్. కేరళలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా అదే తేదీకి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ మీద దుల్కర్ పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కానీ మలయాళంలో ప్రభాస్ కు, రాజమౌళికి ఒకేసారి షాక్ ఇవ్వడం మాత్రం ఖాయం. ఎందుకంటే స్వతహాగా ఎక్కడైనా ప్రాంతీయ చిత్రాలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పటికే వలిమైని ఎలా ఎదురుకోవాలో అర్థం కాక సతమతమవుతున్న పాన్ ఇండియా సినిమాలకు సెల్యూట్ కొత్త ఇబ్బంది

మొత్తానికి సంక్రాంతి పందెం మాత్రం రసవత్తరంగా మారుతోంది. ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ ని వాయిదా వేయించగలిగిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇప్పుడు సెల్యూట్, వలిమైలను మాత్రం ఏమి చేయలేవు. ఇక్కడ స్క్రీన్లు తక్కువ వచ్చేలా చేయడం తప్ప ఇంకే చర్య తీసుకోలేరు. దానివల్ల వాటికి వచ్చే నష్టం లేదు. అక్కడా వాళ్ళు ఇదే ఫార్ములాను పాటిస్తే మన సినిమాలకూ థియేటర్లు తగ్గుతాయి. రాబోయే రోజుల్లో సౌత్ ఇండియా మొత్తం ఒక గిల్డ్ గా మారి రిలీజుల గురించి ఒక అండర్ స్టాండింగ్ తెచ్చుకోవడం తప్పేలా లేదు. లక్కీగా బాలీవుడ్ నుంచి ఒక్క సినిమా సంక్రాంతికి లేకపోవడం సేఫ్ అయ్యింది. లేదంటే తలనెప్పి రెట్టింపయ్యేది

Also Read : Harshavardhan : గూగ్లీ మిస్ అయ్యింది – ఇది కొట్టే తీరాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి