iDreamPost

Raja Vikramarka : చిన్న హీరోల మధ్య పెద్ద యుద్ధం

Raja Vikramarka :  చిన్న హీరోల మధ్య పెద్ద యుద్ధం

మరో శుక్రవారానికి రంగం సిద్ధమవుతోంది. కనీసం మూడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు లేనిది బాక్సాఫీస్ వీక్ గడవడం లేదు. అందులో భాగంగానే ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడుతోంది. స్టార్లు లేరు కానీ ఉన్నంతలో ఈ యుద్ధం ఆసక్తిని రేపుతోంది. ఆరెక్స్ 100 సెన్సేషన్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ కొత్త చిత్రం రాజా విక్రమార్క. చిరంజీవి పాత టైటిల్ ని పెట్టుకున్న ఈ స్పై థ్రిల్లర్ కి దర్శకుడు శ్రీ సారిపల్లి. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో బిజినెస్ బాగానే జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న చావు కబురు చల్లగా డిజాస్టర్ కావడంతో కార్తికేయ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి.ఇందులో హీరోయిన్ తాన్యా రవిచంద్రన్

రెండోది ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం. ఫ్యామిలి అండ్ యూత్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి దామోదర్ దర్శకుడు. లాక్ డౌన్ టైంలోనే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు. దీనికి బజ్ అంతగా లేకపోయినా కేవలం టాక్ బాగా వస్తుందనే నమ్మకంతో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఉన్న కాసిన్ని అంచనాలు నిలబెట్టుకోగల్గితే నిర్మాతలు సేఫ్ గా గట్టెక్కుతారు. ఇక మూడోది కురుప్. దుల్కర్ సల్మాన్ హీరోగా మలయాళంలో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ రూపంలో తీసుకొస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ లుక్ తోనే ఇది కనిపిస్తోంది. పెద్దగా అంచనాలు లేవు.

ఇవి కాకుండా సుదీప్ కన్నడ డబ్బింగ్ కె3 వస్తోంది. ఇది ఒరిజినల్ వెర్షన్ లోనే సోసోగా ఆడిందని అక్కడి రిపోర్ట్. తెలంగాణ దేవుడుతో శ్రీకాంత్ వస్తున్నాడు. దీని గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. స్ట్రీట్ లైట్ అనే మరో చిన్న సినిమా రేస్ లో దిగుతోంది. రెండు హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. వీటి సంగతెలా ఉన్నా ప్రేక్షకుల దృష్టిలో అంతో ఇంతో ఉన్నవి మాత్రం పైన చెప్పిన మూడే. కాకపోతే ఏదీ భారీ ఓపెనర్ కాదు. లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత వసూళ్ల పరంగా చెప్పుకోదగిన సినిమా ఏదీ రాలేదు. అధిక శాతం యావరేజ్ ఫలితాలే. మరి ట్రయాంగిల్ వార్ లో ఏదైనా హిట్టు కొట్టి కొత్త జోష్ తీసుకొస్తుందేమో చూడాలి.

Also Read : Pushpaka Vimanam : పుష్పక విమానం – బ్రదర్స్ ప్రమోషన్ వ్యూహం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి