iDreamPost

డేటా దుర్వినియోగం అవుతుందని ఆరోపిస్తున్న వారికి.. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కౌంటర్!

అలా చేయడం వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యత, వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ఈ విమర్శలకు సంబంధించి కర్నూలు సర్వజన వైద్య శాలలో గుండె, ఊపిరితిత్తుల నిపుణులుగా ఉన్న డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. అందులో అసలు మీ డేటా ఎందుకు తీసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదంటంటే వాలంటీర్ వ్యవస్థ చేతుల్లో రాష్ట్ర ప్రజల డేటా మొత్తం పెడుతున్నారు. అలా చేయడం వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యత, వారి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపణలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే ఈ విమర్శలకు సంబంధించి కర్నూలు సర్వజన వైద్య శాలలో గుండె, ఊపిరితిత్తుల నిపుణులుగా ఉన్న డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. అందులో అసలు మీ డేటా ఎందుకు తీసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు.

రాసుకోరా సాంబ అంటూ.. “మా ఇంట్లో నేను- నా భార్య- మా కొడుకు ఉంటాం. రెండు బెడ్ రూంలు, రెండు బాత్రూంలు ఉన్నాయి. రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఈ డేటా ఎందుకంటే మనకు ఇంటి పన్ను కరెక్ట్ గా వేసేందుకు. మా ఇంటికి ఒక కుళాయి ఉంది.. బోర్ ఉంది.. ఈ డేటా ఎందుకంటే నీటి పన్ను వేయడానికి. మా ఇంటికి త్రీ ఫేస్ కనెక్షన్ ఉంది.. ఆరు ఎయిర్ కండిషన్లు ఉన్నాయి.. ఈ డేటా ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్లు వేయడానికి… నేను బిల్లు వెంటనే కడతాను.

ఓ గ్యాస్ కనెక్షన్ ఇండియన్ ది ఉంది.. దానికి ఆధార్ నంబరు.. అకౌంట్ నంబరు యాడ్ చేశాం. ఈ డేటా ఎందుకంటే గ్యాస్ సబ్సిడీ మన అకౌంట్లో వేయడానికి. నా పాన్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఫారం 16 ఇన్కమ్ టాక్స్ వాళ్లకు ఇచ్చి మా డేటా అప్లోడ్ చేస్తాం, ట్యాక్స్ కడతాం. ఏ హోటల్ కి వెళ్లినా, ఎక్కడికి పోయినా మా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు జిరాక్స్ ఇస్తం.. రూములు ఇస్తారు. ఇంతకంటే తొక్కలో డాటా నా దగ్గర ఏముంది? ఏ డేటా తీసుకున్నా నువ్వు ఏం చేయగలవు? ఈ డేటా రష్యా, అమెరికాకు చేరి ప్రపంచ యుద్ధాలు ఏమీ రావు. ఈ డేటా చాలా ఇంకా కావాలా?

సార్ మీకు మీ డేటాకు ఓదండం.. మీ డేటా మీ దగ్గరే పెట్టుకోండి… మా దగ్గర అదే ఉంది… మీరు అదే చెప్తున్నారు .. ఇంకా కొత్తదేముంది… కొత్త డేటా ఏం లేదు.. నాకేం భయం లేదు.. నువ్వు భయపడొద్దు. నీకేం కావాలన్నా అడుగు తీసుకో.. నువ్వు డేటా తీసుకోవడం వల్ల నా కొంపలేం మునగవు. అదే పేదవాళ్ళు దగ్గర ఎందుకు డేటా తీసుకుంటారంటే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవన, జగనన్న వసతి దీవెన, ఇంటి జాగాలు ఇటువంటి సంక్షేమ పథకాలు వస్తాయి. ప్రజలకు మేలే.. ఈ తొక్కలో డేటాతో ప్రపంచ యుద్ధాలు ఏం రావు. మా జీవితాలు బాగుపడతాయే కానీ సమస్యలేం లేవు” అంటూ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి