iDreamPost

క్రియేటివ్ దర్శకుడి క్లాసిక్ రీమేక్ వస్తోంది

క్రియేటివ్ దర్శకుడి క్లాసిక్ రీమేక్ వస్తోంది

ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండ ఆగుతూ సాగుతూ మెల్లగా ఒక కొలిక్కి వస్తోంది. మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ డ్రామా. ఒరిజినల్ వెర్షన్ లో నానా పాటేకర్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అది చూసి మనసు పారేసుకునే కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధపడ్డారు. గత ఏడాది లాక్ డౌన్ కు ముందే షూటింగ్ అయిపోతుందన్న టాక్ వచ్చింది కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యింది. ఎలాంటి అప్ డేట్స్ లేవు. యూనిట్ సభ్యులు కానీ నిర్మాతలు కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఏవో ఆర్థిక కారణాలనే ప్రచారం కూడా జరిగింది.

తాజాగా ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుని డిసెంబర్ రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నారట. రమ్యకృష్ణ, అనసూయ, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, వంశీ చాగంటి ఇలా క్వాలిటీ క్యాస్టింగ్ నే సెట్ చేసుకున్నారు. సంగీతం కూడా ఆషామాషీగా చేయించుకోలేదు. తనకు అంతఃపురం లాంటి గొప్ప మ్యూజికల్ స్కోర్ ఇచ్చిన ఇళయరాజానే కృష్ణవంశీ ఏరికోరి మరీ తీసుకొచ్చారు. పాటల కంపోజింగ్ కూడా దాదాపు అయిపోయిందట. బ్యాలన్స్ ఉన్న ట్యూన్లను ఇటీవలే పూర్తి చేశారు. ఇంత సెటప్ ఉండి ఎందుకు ఆలస్యమయ్యిందనే కారణం మాత్రం బయటికి రావడం లేదు. రిలీజ్ సూన్ అని మాత్రం చెబుతున్నారు.

ఒక గొప్ప రంగస్థలనటుడు నటన నుంచి విరామం తీసుకున్నాక ఇంటా బయటా ఎదురుకున్న పరిణామాల క్రమాన్ని నట సామ్రాట్ లో చాలా ఎమోషనల్ గా చూపించారు. తెలుగులో కూడా అదే స్థాయిలో కొద్దిపాటి మార్పులతో కృష్ణవంశీ తీశారని టాక్ ఉంది. చాలా కాలంగా హిట్ లేక సతమతమవుతున్న ఈ దర్శకుడి రేంజ్ కి తగ్గ సినిమా వచ్చి ఎన్నో ఏళ్ళు దాటింది. రంగమార్తాండతో కం బ్యాక్ అవుతారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి జరుగుతున్న జాప్యం సహనానికి పరీక్ష పెడుతోంది. డిసెంబర్ అన్నారు కానీ థియేటరా లేక ఓటిటినా అనే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే రెండో ఆప్షనే బెటరనిపిస్తోంది.

Also Read :  బాసూ ఎందుకు ఈ ‘ హగ్స్ రచ్చ’?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి